ఈసారికి 8 జట్లే... కొత్తగా రెండు ఐపీఎల్ జట్ల కోసం టెండర్లు అప్పుడే... కీలక నిర్ణయాలు తీసుకున్న బీసీసీఐ...
First Published Dec 24, 2020, 6:21 PM IST
అహ్మదాబాద్‌లో జరిగిన బీసీసీఐ వార్షిక సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీసీసీఐ. వచ్చే ఏడాది భారత్ వేదికగా నిర్వహించబోయే టీ20 వరల్డ్‌కప్ వేదిక, నిర్వహణలతో పాటు ఐపీఎల్‌లో అదనపు జట్లను చేర్చే విషయంలో కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు టాక్. 2021 సీజన్‌కి పెద్దగా సమయం లేనందున 2022 సీజన్‌లో 10 జట్లను ఆడించేందుకు బీసీసీఐ ఏజీఎమ్ (Annual General meeting) అంగీకరించినట్లు సమాచారం.

వచ్చే ఏడాది 8 జట్లే ఐపీఎల్ 14వ సీజన్ బరిలో దిగుతున్నాయి. అదనపు జట్లను తీసుకొచ్చేందుకు సరిపడా సమయం లేనందున, కొత్త ఫ్రాంఛైజీలను 2022 సీజన్‌లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

2022 సీజన్‌లో అదనంగా రెండు కొత్త ఫ్రాంఛైజీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇందుకోసం వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో టెండర్లను ఆహ్వానించనుంది భారత క్రికెట్ బోర్డు...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?