- Home
- Sports
- Cricket
- కోహ్లీ తప్పుకోవడానికి సౌరవ్ గంగూలీయే కారణమా... బీసీసీఐ ప్రెసిడెంట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
కోహ్లీ తప్పుకోవడానికి సౌరవ్ గంగూలీయే కారణమా... బీసీసీఐ ప్రెసిడెంట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
టీ20 వరల్డ్ కప్ 2022, ఆసియా కప్ 2022 ఇలాంటి రెండు మెగా టోర్నీల ముందు భారత జట్టును వేధిస్తున్న సమస్య స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్. కొంత కాలంగా ఫామ్‌లో లేని కెప్టెన్ రోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే కోహ్లీ మాత్రం గాయంతో తొలి వన్డేకి దూరమయ్యాడు...

Image credit: Getty
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి వన్డే ఆరంభానికి ముందు విరాట్ గాయంతో మ్యాచ్‌కి దూరం కావడం పలు అనుమానాలకు తావిచ్చింది...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో టీమిండియాలో అలజడి రేగింది. ఆ తర్వాత కొన్నిరోజులకే విరాట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం సంచలనం క్రియేట్ చేసింది...
వన్డేల్లో సారథిగా అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో బీసీసీఐకీ, అతనికీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని వార్తలు వినిపించాయి...
దీంతో ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని పక్కనబెట్టడానికే గజ్జల్లో గాయమైందని చెప్పారని ట్రోల్స్ వినిపించాయి. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీయే, కోహ్లీ నీకు గాయమైంది! నీకు రెస్ట్ కావాలని చెప్పాడని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి...
Image credit: Getty
తాజాగా ఏఎన్‌ఐతో మాట్లాడిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు చూడండి, అతనిలో సత్తా, క్వాలిటీ లేకపోతే అన్ని పరుగులు చేయగలడా?
Image credit: Getty
అవును, నిజమే అతనిప్పుడు టఫ్ టైమ్‌లో ఉన్నాడు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. అతని స్టాండర్ట్స్ ఏంటో అతనికి కూడా బాగా తెలుసు..
త్వరలోనే అతను కమ్‌బ్యాక్ ఇచ్చి, బాగా ఆడతాడనే నమ్మకం ఉంది. తను సక్సెస్ కావడానికి అతనే మార్గాలు కనుక్కోవాలి. 12-13 ఏళ్లుగా, అంతకంటే ఎక్కువ సమయం నుంచే విరాట్ చేస్తుందదే. విరాట్ మాత్రమే ఆ పని చేయగలడు...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...