- Home
- Sports
- Cricket
- కోడలు మయంతి లాంగర్ వల్ల చిక్కుల్లో రోజర్ బిన్నీ?... బీసీసీఐ అధ్యక్షుడికి నోటీసులు జారీ...
కోడలు మయంతి లాంగర్ వల్ల చిక్కుల్లో రోజర్ బిన్నీ?... బీసీసీఐ అధ్యక్షుడికి నోటీసులు జారీ...
బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ చిక్కుల్లో ఇరుక్కున్నాడు. కోడలు మయంతి లంగర్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌కి క్రికెట్ యాంకర్‌గా వ్యవహరిస్తుండడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీకి విరుద్ధంగా ఫిర్యాదు చేశాడు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా...

1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ రోజర్ బిన్నీ కొడుకు, టీమిండియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ, స్టార్ యాంకర్ మయంతి లాంగర్‌ని ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన మయంతి లాంగర్, బ్రేక్ తర్వాత మళ్లీ యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చింది...
ప్రస్తుతం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్‌కి స్పోర్ట్స్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న మయంతి లాంగర్, న్యూజిలాండ్‌లో ఉంది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదులతో అధ్యక్షుడు రోజర్ బిన్నీపై కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెక్ట్ కింద నోటీసులు జారీ చేసింది బీసీసీఐ.
Image credit: PTI
బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్, అధ్యక్షుడు రోజర్ బిన్నీకి పరస్పర ప్రయోజనాల ఆరోపణలపై నోటీస్ జారీ చేశారు. డిసెంబర్ 20లోగా దీనిపై రాతపూర్వక వివరణ ఇవ్వాల్సిందిగా బిన్నీని కోరాడు వినీత్ శరణ్. సంజీవ్ గుప్తా, ఇంతకుముందు బీసీసీఐ అధికారులపై, కోచ్‌లపై అనేక ఆరోపణలు చేశారు.
భారత క్రికెట్ బోర్డులో జరుగుతున్న రాజకీయాలపై, అవకతవకలపై పోరాటం చేస్తున్నట్టుగా ప్రకటించుకునే సంజీవ్ గుప్తా.. గతంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై కూడా ఆరోపణలు చేశారు. అయితే రోజర్ బిన్నీపై చేసిన సంజీవ్ గుప్తా చేసిన పరస్పర ప్రయోజన ఆరోపణలు తేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...
ఎందుకంటే బీసీసీఐ, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ రెండూ కూడా పూర్తిగా వేర్వేరు సంస్థలు. బీసీసీఐ బాస్‌గా ఉన్న రోజర్ బిన్నీ చెప్పడం వల్లే మయంతి లాంగర్‌కి స్టార్ స్పోర్ట్స్‌లో తిరిగి ఉద్యోగం వచ్చిందని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే కొన్నేళ్ల పాటు స్పోర్ట్స్ యాంకర్‌గా తిరుగులేని స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది మయంతి...
మయంతి లాంగర్ కోసమే చాలా మంది బ్రేక్ టైమ్‌లో కానీ, క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కానీ ఛానెల్ మార్చకుండా చూసేవాళ్లు. అలాంటి మయంతి లాంగర్ రీఎంట్రీ ఇవ్వడానికి, మామ రోజర్ బిన్నీ రిఫరెన్సులు అవసరం లేదనేది అందరికీ తెలిసిన విషయమే.. రెండు వేర్వేరు సంస్థలు అయినప్పుడు పరస్పర ప్రయోజనం ఎలా అవుతుందనేది సంజీవ్‌కే తెలియాలని అంటున్నారు నెటిజన్లు.