MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆ ఐదుగురూ వచ్చేస్తున్నారు! బుమ్రా, రాహుల్, రిషబ్ పంత్... ఫిట్‌నెస్ అప్‌డేట్స్ ఇచ్చిన జై షా...

ఆ ఐదుగురూ వచ్చేస్తున్నారు! బుమ్రా, రాహుల్, రిషబ్ పంత్... ఫిట్‌నెస్ అప్‌డేట్స్ ఇచ్చిన జై షా...

రెండేళ్లుగా టీమిండియాని వెంటాడుతున్న అతి పెద్ద సమస్య ఆటగాళ్ల గాయాలు. జస్ప్రిత్ బుమ్రా లేకుండానే ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు.. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ లేకుండా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఆడింది.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 21 2023, 07:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆసియా కప్ 2023 షెడ్యూల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ కూడా మొదలైపోయింది. అయితే ఇప్పటిదాకా టీమిండియా స్టార్ ప్లేయర్ల ఫిట్‌నెస్, కమ్‌బ్యాక్ గురించి ఎలాంటి వివరాలు తెలియక ఫ్యాన్స్ తెగ ఆందోళన పడుతున్నారు. దీంతో టీమిండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ అప్‌డేట్స్ ఇచ్చింది బీసీసీఐ..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Jasprit Bumrah

Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ: గాయాలతో ఐపీఎల్ 2023 టోర్నీ ఆడని ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. త్వరలో ఎన్‌సీఏలో కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడబోయే బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.. వీలైనంత త్వరలో కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారు..

36
KL Rahul

KL Rahul

కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడిన కెఎల్ రాహుల్... ఇప్పటికే బెంగళూరులోని ఎన్‌సీఏలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కోలుకుంటున్న విధానంపై బీసీసీఐ మెడికల్ టీమ్ సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే మరికొన్నిరోజులు ఈ ఇద్దరినీ పర్యవేక్షించబోతున్నారు జాతీయ క్రికెట్ అకాడమీ అధికారులు..

46
Rishabh Pant

Rishabh Pant

రిషబ్ పంత్: గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, ఆశించిన దాని కంటే వేగంగా కోలుకుంటున్నాడు. ఇప్పటికే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రిషబ్ పంత్, జిమ్‌లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు చెమటోడుస్తున్నాడు..

56
Shreyas Iyer

Shreyas Iyer

జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలను ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపిక చేసే అవకాశం ఉంది. కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్ 2023 టోర్నీలో రీఎంట్రీ ఇవ్వవచ్చని సమాచారం. రిషబ్ పంత్ మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ నాటికి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు..
 

66

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రిషబ్ పంత్ ఆడతాడా? లేదా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడతాడా? లేదా? అనే విషయంపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

About the Author

CR
Chinthakindhi Ramu
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup Prize Money: వరల్డ్ కప్ కొట్టిన ఆస్ట్రేలియాపై కాసుల వర్షం.. మరి టీమిండియాకు ఎన్ని కోట్లొచ్చాయో తెలుసా?
Recommended image2
T20 World Cup 2026: మా ప్లాన్ అదే.. ఆసీస్ క్లాస్ టీమ్.. మమ్మల్ని దెబ్బకొట్టారు.. ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఎమోషనల్ కామెంట్స్ !
Recommended image3
T20 World Cup 2026: ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. ఇంగ్లాండ్ కొంపముంచిన ఐదు తప్పులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved