యువరాజ్ సింగ్‌కి షాక్ ఇచ్చిన బీసీసీఐ... రీఎంట్రీకి అనుమతి నిరాకరణ...
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. అర్థాంతరంగా క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. జనవరి 10 నుంచి మొదలయ్యే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో బరిలో దిగాలని కూడా అనుకున్నాడు. కానీ అతని ఆశలపై నీళ్లు చల్లింది బీసీసీఐ.
- FB
- TW
- Linkdin
Follow Us

టీ20ల్లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది, అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన క్రికెటర్‌గా రికార్డు నమోదుచేశాడు యువరాజ్ సింగ్...

కెరీర్‌లో పీక్ స్టేజీలో ఉన్నప్పుడు క్యాన్సర్ బారిన పడి, క్రికెట్‌కి కొంత కాలం దూరమయ్యాడు. మైదానంలోనే రక్తపు వాంతులు చేసుకుని కూడా ఆటను కొనసాగించి, తన అంకితభావంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

క్యాన్సర్ నుంచి కోలుకుని క్రికెట్ రీఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్ ఫామ్ కోల్పోయి, మళ్లీ జట్టుకి దూరమయ్యాడు.

టీమిండియాలో ప్లేస్ కోసం వెయిట్ చేసినా, ఫలితం కనిపించకపోవడంతో 2019 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు యువీ.

తాజాగా తన నిర్ణయం మార్చుకున్న యువరాజ్, రీఎంట్రీ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాశాడు...

అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ లీగ్స్ ఆడిన క్రికెటర్లకి దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ ఆడే అవకాశం ఉండదు. 2020 ఐపీఎల్‌లోనూ ప్రవీణ్ తాంబే ఈ కారణంగానే ఆటకు దూరమయ్యాడు...

రిటైర్మెంట్ తర్వాత గ్లోబర్ టీ20 కెనడా, టీ10 లీగ్స్‌లో పాల్గొన్నాడు యువరాజ్ సింగ్... ఈ కారణంగానే యువరాజ్ రీఎంట్రీని నిరాకరించింది బీసీసీఐ.

సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీకి ప్రకటించిన 30 మంది ప్రాబబుల్స్ జాబితాలో యువీకి చోటు కూడా దక్కింది. అయితే బీసీసీఐ నిర్ణయంతో అతను టోర్నీ నుంచి తప్పుకోబోతున్నాడు.

యువరాజ్ సింగ్‌కి బదులుగా మన్‌దీప్ సింగ్ పంజాబ్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తాడు. వైస్ కెప్టెన్‌గా గుర్‌కీరట్ సింగ్ మాన్ వ్యవహరిస్తాడు...

సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మర్కండే, బరిందర్ స్రాన్ వంటి ప్లేయర్లు పంజాబ్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.

2019లో క్రికెట్‌కి అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు విషయంలో హైదరాబాద్ ఇలాగే వ్యవహారించింది. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు హెచ్‌సీఏ అనుమతి ఇవ్వకపోవడంతో ఆంధ్రా తరుపున బరిలో దిగుతున్నాడు అంబటి రాయుడు.

అయితే అంబటి రాయుడు ఏ విదేశీ లీగ్‌ల్లో పాల్గొనకపోవడంతో రీఎంట్రీకి బీసీసీఐ అనుమతి అవసరం లేదు...