- Home
- Sports
- Cricket
- గంగూలీ నన్ను దానికోసం రెండుసార్లు రమ్మన్నాడు.. కానీ నేనే : పీసీబీ ఛీప్ షాకింగ్ కామెంట్స్
గంగూలీ నన్ను దానికోసం రెండుసార్లు రమ్మన్నాడు.. కానీ నేనే : పీసీబీ ఛీప్ షాకింగ్ కామెంట్స్
Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉన్న సౌరవ్ గంగూలీ తన హయాంలో ఐపీఎల్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తున్నాడు. అయితే గంగూలీ తనను రెండుసార్లు పిలిచినా తాను వెళ్లలేదని..

ఐపీఎల్ ఫైనల్స్ అంటేనే నానా హంగామా ఉంటుంది. వేలాది మంది ప్రేక్షకులు, బాలీవుడ్ నటులు, సంగీత దర్శకులు, రాజకీయ నాయకులు ఈ మ్యాచ్ చూడటానికి వస్తుంటారు.
ఇటీవలే అహ్మదాబాద్ లో ముగిసిన ఐపీఎల్-15 ఫైనల్స్ కు లక్షకు పైగా జనం రాగా రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, ఎఆర్ రెహ్మాన్ తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్ కు వీరితో పాటు మరో వ్యక్తికి కూడా ఆహ్వానం అందినా అతను మాత్రం ఇందుకు రాలేదట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. అతడెవరో కాదు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఆ దేశ బోర్డు చైర్మెన్ గా ఉన్న రమీజ్ రాజా. రమీజ్ ను ఐపీఎల్ ఫైనల్ కు ఆహ్వానించింది బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ.
ఇదే విషయమై తాజాగా అతడు మాట్లాడుతూ.. ‘గతంలో రెండు సార్లు గంగూలీ నన్ను ఐపీఎల్ ఫైనల్స్ (2021, 2022) కు రమ్మన్నాడు. కానీ నేనే వెళ్లలేదు. దుబాయ్ లో గతేడాది ముగిసిన ఐపీఎల్ ఫైనల్స్ కు రావాలని గంగూలీ మరీ మరీ చెప్పాడు.
కానీ నేను అక్కడికి వెళ్లాలా..? వద్దా..? అనే మీమాంసలో పడిపోయాను. ఎందుకంటే నేను ఒకవేళ ఐపీఎల్ ఫైనల్స్ కు హాజరైతే పాకిస్తాన్ ఫ్యాన్స్ నన్ను క్షమించరు. అయితే క్రికెట్ పరంగా చూస్తే నేను అక్కడికి వెళ్లడం సబబే అనిపించింది. కానీ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య క్రికెట్ ఆట కంటే రాజకీయ ఆట నడుస్తున్నది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకోలేక ఐపీఎల్ ఫైనల్స్ కు రాలేదు..’ అని తెలిపాడు.
ఇక ఈ ఏడాది ప్రారంభంలో పీసీబీ ప్రతిపాదించిన ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ల టీ20 సిరీస్ ను ఐసీసీ ఆమోదించకపోవడంపై రమీజ్ రాజా స్పందించాడు.
‘నేను దీని గురించి కూడా గంగూలీతో మాట్లాడాను. క్రికెటర్లుగా బోర్డులో అత్యున్నత పదవుల్లో ఉన్నది చాలా తక్కువ మంది. ఉన్న ఇద్దరు ముగ్గురిలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుంటే ఎలా..? ఇక మిగతా వాళ్లకు మనకు తేడా ఏమిటి..? అయితే ఈ విషయంలో గంగూలీకి ఆందోళనలు గంగూలీకి ఉన్నాయి..’ అని స్పష్టం చేశాడు.