అందుకే ఐపీఎల్ ఆడబోతున్నా, తెలియకుండా మాట్లాడకండి... వివాదంపై షకీబ్
మరో 18 రోజుల్లో ఐపీఎల్ 2021 మహా సంగ్రామం మొదలుకానుంది. ఈ టోర్నీలో పాల్గొనాలని బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తీసుకున్న నిర్ణయంపై బంగ్లా బోర్డు సీరియస్ అయ్యింది...

ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే శ్రీలంకతో కలిసి టెస్టు సిరీస్ ఆడబోతోంది బంగ్లా క్రికెట్ జట్టు. దీంతో షకీబ్ అల్ హసన్, ఐపీఎల్ ఆడితే టెస్టులకు దూరం కావాల్సి ఉంటుంది....

షకీబ్ అల్ హసన్‌కి టెస్టులు ఆడాలని ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది, అదీకాకుండా ఐపీఎల్ ఆడితే బాగా డబ్బులు వస్తాయని దేశానికి ఆడడం కంటే దానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు అంటూ విమర్శించింది బంగ్లా క్రికెట్ బోర్డు...

దీనిపై స్పందించిన షకీబ్ అల్ హసన్... ‘శ్రీలంకతో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. నిజానికి ఇది, బంగ్లాకి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బంగ్లాకి చివరి సిరీస్. బంగ్లా జట్టు ఫైనల్‌కి అర్హత సాధించలేదు...

టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న బంగ్లాదేశ్, టెస్టు సిరీస్ గెలిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు... కాబట్టి నేను టెస్టు సిరీస్‌లో ఉన్నా, లేకున్నా పెద్ద నష్టమేమీ జరగదు...

ఈ ఏడాది చివర్లో ఇండియాలో టీ20 వరల్డ్‌కప్ ఆడబోతున్నాం. ఐపీఎల్ ఆడితే అక్కడి పరిస్థితులపై ఓ క్లారిటీ వస్తుంది. టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఐపీఎల్ చాలా ముఖ్యమైన టోర్నీ...

అందుకే టెస్టు సిరీస్ కంటే ఐపీఎల్‌లో ఆడాలని భావించా... కానీ నేను ఇకపై టెస్టులు ఆడడం లేదని చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడూ అలా చెప్పలేదు.

రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటే, అందరికీ ముందుగానే ప్రకటిస్తాను... నేను బంగ్లా క్రికెట్ బోర్డుకు రాసిన లేఖను ముందు పూర్తిగా చదవండి. టీ20 వరల్డ్‌కప్ కోసమే ఐపీఎల్ ఆడబోతున్నట్టు వివరించాను...’ అంటూ చెప్పాడు షకీబ్ అల్ హసన్...

ఐపీఎల్ 2021 వేలంలో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు రూ.3 కోట్ల 30 లక్షలకు కొనుగోలు చేసింది...

గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పలు జట్లకి ఆడిన షకీబ్ అల్ హసన్, 2012, 2014 సీజన్లలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు...

2019 వన్డే వరల్డ్‌కప్ ముందు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న షకీబ్ అల్ హసన్ 12 నెలల బ్యాన్ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.