Babar Azam: నేను కింగ్ ను కాదురా సామి !
Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం మీడియా సమావేశంలో 'కింగ్' పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

Image Credit: Getty Images
Babar Azam: పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజం మీడియాతో మాట్లాడుతూ.. తనను "కింగ్" అని పిలవడం ఆపమని కోరాడు. క్రికెట్ లో బాబర్ ఆజం సాధించిన రికార్డులు, గొప్ప ఇన్నింగ్స్ లకు ప్రశంసగా అక్కడి మీడియా కింగ్ అంటూ పేర్కొంటుంది. అయితే, తనను ఆలా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని బాబార్ ఆజం చెప్పాడు.
Image Credit: Getty Images
కింగ్ అని పిలవొద్దు.. బాబార్ ఆజం ఏం చెప్పాడంటే?
బాబార్ ఆజం పాకిస్తాన్ తరపున 59 టెస్టులలో 4235 పరుగులు, 125 వన్డేలు ఆడి 5990 పరుగులు చేశాడు. అలాగే, 128 టీ20లు ఆడి 4223 పరుగులు చేశాడు. పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ గా, అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. దీంతో అతన్ని పాక్ మీడియా కింగ్ అంటూ పిలుచుకుంటుంది.
కానీ, తనను అలా పిలవద్దని బాబార్ ఆజం అన్నారు. "దయచేసి నన్ను కింగ్ అని పిలవడం ఆపండి. నేను కింగ్ ను కాదు, నేను ఇంకా అక్కడికి చేరలేదు. ఇప్పుడు నాకు కొత్త రోల్స్ ఉన్నాయి. నేను ఇంతకు ముందు చేసినదంతా గతంలోనే.. ప్రతి మ్యాచ్ కొత్త సవాలు, నేను ప్రస్తుతంతో పాటు రాబోయే కాలంపై దృష్టి పెట్టాలి" అని బాబర్ మీడియాతో అన్నారు.
రిటైర్మెంట్ తర్వాత గుర్తుంచుకునే పేరు కావాలి: బాబర్ ఆజం
తనకు తానుగా నిర్దేశించుకున్న ఆటతీరును ప్రస్తుతం ప్రదర్శించలేకపోవడంతో తనను ఇప్పుడే కింగ్ గా పిలవద్దని కోరాడు. " పెహ్లీ బాత్ తో యే కింగ్-షింగ్ కర్నా, బోల్నా జరా కమ్ కరీన్ (ముందుగా, నన్ను కింగ్ అని పిలవడం మానేయండి)" అని బాబర్ అన్నాడు. "నేను ఇంకా రాజును కాలేదు. నేను రిటైర్మెంట్ చేసినప్పుడు ప్రజలు నన్ను ఏమని పిలుస్తారో చూద్దాం. ఓపెనింగ్ నాకు కొత్త పాత్ర.. జట్టు అవసరాలకు అనుగుణంగా నేను ఈ బాధ్యతను స్వీకరించాను" అని బాబార్ ఆజం తెలిపారు.
ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్లు ఫఖర్ జమాన్, బాబర్ ఆజం బ్యాటింగ్ ఆతిథ్య జట్టు టైటిల్‌ను కాపాడుకోవడానికి ఎలా సహాయపడుతుందో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతకుముందు మాట్లాడారు. ముఖ్యంగా, 2017లో ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్ భారత్‌ను 180 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న విషయాలు ప్రస్తావించారు.
"పాకిస్తాన్ ఆ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి నిజంగా మంచి అవకాశం ఉంది. వారికి బలమైన జట్టు ఉందని నేను భావిస్తున్నాను. 2017 నుండి కొంతమంది జట్టులో ఇప్పటికీ ఉన్నారు. మేము కొంతమంది అత్యుత్తమ ఆటగాళ్లను చూస్తే అందులో బాబార్ ఆజం కూడా ఉన్నారని" అని సర్ఫరాజ్ అన్నారు.
"2017లో ఆడిన బాబర్ కంటే ఇప్పుడు అతను భిన్నమైనవాడు. మరింత పరిణతి చెందిన ఆటగాడు. ఆటలో ఆధిపత్యం చెలాయించే ప్లేయర్. అతని బ్యాటింగ్ పాకిస్తాన్‌కు చాలా ముఖ్యమైనది, ఫఖర్ జమాన్ కూడా అంతే ముఖ్యమైన ప్లేయర్" అని అతను పేర్కొన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ బిగ్ ఫైట్ ఎప్పుడంటే?
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ vs పాకిస్తాన్ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తమ చిరకాల ప్రత్యర్థులతో జరిగే మ్యాచ్‌లో ఆటగాళ్ళు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి లేకుండా ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉందని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
"మనం ఎప్పుడు కలిసినా, అది ఒక ప్రత్యేక సందర్భం. దాని చుట్టూ చాలా హైప్.. ఒత్తిడి ఉంటుంది. కానీ ఆటగాళ్లుగా, మీరు ప్రశాంతంగా ఉండాలి.. ఒత్తిడిని జయించాలి" అని మాజీ బ్యాటర్ అన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ జట్టు:
మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం , సౌద్ షకీల్ , తయ్యబ్ తాహిర్ , ఫహీమ్ అష్రఫ్ , ఖుష్దిల్ షా , సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్ , హరీస్ రహూఫ్స్ , హరీస్ రహుఫ్స్ ఆఫ్రిది.
ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ మ్యాచ్‌లు: న్యూజిలాండ్‌తో (ఫిబ్రవరి 19 కరాచీలో), భారత్ తో (ఫిబ్రవరి 23 దుబాయ్‌లో), బంగ్లాదేశ్‌తో (ఫిబ్రవరి 27 రావల్పిండిలో) ఆడనుంది.