MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆమె ఫిఫ్టీ కోసమే ఆడుతుంది, అందుకే తను క్రీజులో ఉంటే... మిథాలీరాజ్‌పై ఆలీసా హేలీ షాకింగ్ కామెంట్స్...

ఆమె ఫిఫ్టీ కోసమే ఆడుతుంది, అందుకే తను క్రీజులో ఉంటే... మిథాలీరాజ్‌పై ఆలీసా హేలీ షాకింగ్ కామెంట్స్...

భారత మహిళా జట్టు వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీరాజ్ రికార్డుల వర్షం కురిపిస్తూ, సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తోంది. మహిళల క్రికెట్‌లో 20 వేల అంతర్జాతీయ పరుగులు అందుకున్న మిథాలీరాజ్, వన్డేల్లో రికార్డు స్థాయిలో హాఫ్ సెంచరీలు కూడా అందుకుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 26 2021, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

22 ఏళ్లపై సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగిస్తున్న మిథాలీరాజ్, సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా త్వరలోనే బ్రేక్ చేయబోతోంది...

28

అందుకే మిథాలీరాజ్‌ని ‘లేడీ సచిన్’ అని పిలుస్తారు. అయితే మిథాలీరాజ్, జట్టు విజయం కంటే కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతుందని విమర్శ ఉంది...

38

‘మిథాలీరాజ్ కేవలం ఫిఫ్టీ కొట్టాలని క్రీజులో పాతుకుపోతుంది. అందుకే ఆమె ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే, మాకు అంత లాభం..  అందుకే మిథాలీ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకుంటాం...’ అంటూ కామెంట్ చేసింది ఆసీస్ వికెట్ కీపర్ ఆలీసా హేలీ...

48

మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది మిథాలీరాజ్. 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేసింది. అయితే మిగిలిన ప్లేయర్లు విఫలం కావడంతో 225 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది భారత జట్టు...

58

ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదించిన ఆసీస్, మొదటి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఈజీ విజయం సాధించగా రెండో వన్డేలో స్మృతి మంధాన 94 బంతుల్లో 11 ఫోర్లతో 86 పరుగులు చేసి అదరగొట్టింది...

68

రిచా ఘోష్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి వంటి ప్లేయర్లు కూడా రాణించడంతో 274 పరుగులు చేసింది భారత జట్టు. అయితే ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు కావాల్సిన దశలో జులన్ గోస్వామి రెండు నో బాల్స్ వేయడంతో ఆసీస్ విజయం అందుకుంది...

78

మూడో వన్డేలో 2 వికెట్ల తేడాతో నెగ్గిన భారత మహిళా జట్టు... వరుసగా 26 వన్డేల్లో నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు విజయ పరంపరకు బ్రేక్ వేసింది. 264 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన భారత జట్టు, వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేదనను నమోదుచేసింది...

88

మూడో వన్డేలో 28 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన కెప్టెన్ మిథాలీరాజ్ అవుటైన తర్వాత స్నేహ్ రాణా 27 బంతుల్లో 5 ఫోర్లతో 30, దీప్తి శర్మ 30 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసి జట్టు విజయతీరాలకు చేర్చారు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Tilak Varma : తిలక్ వర్మ సెంచరీ విధ్వంసంతో నమోదైన 5 అద్భుత రికార్డులు ఇవే !
Recommended image2
Tilak Varma : తిలక్ వర్మ ఊచకోత.. గుజరాత్‌పై మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించిన తెలుగోడు !
Recommended image3
Ruturaj Gaikwad : రుతురాజ్ గైక్వాడ్‌కు ఏమైంది? CSK కెప్టెన్ మైండ్‌లో ఏం నడుస్తోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved