డేవిడ్ వార్నర్‌కి ఐసీసీ అవార్డు... ఆస్ట్రేలియా క్రికెటర్‌కి ఏ అవార్డు వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు...
డేవిడ్ వార్నర్... ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా భారతదేశంలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి మిలియన్లలో వ్యూస్ రావడానికి డేవిడ్ వార్నర్ కూడా ఓ కారణం. క్రేజీ స్టెప్పులతో ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి వరల్డ్‌వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, ప్రభాస్, రామ్, రామ్‌చరణ్... ఇలా తెలుగు హీరోల వీడియోలను కాపీ కొడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా వార్నర్ పెట్టిన పోస్టు టాక్ ఆఫ్ ది క్రికెట్ ఇండస్ట్రీ అయ్యింది.
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేట్ అవార్డు గెలిచిన విరాట్ కోహ్లీకి అభినందనలు తెలుపుతూ ఇండియన్ జెర్సీలో ఉన్న మార్ఫింగ్ (రీ ఫేస్) వీడియోను పోస్టు చేశాడు డేవిడ్ వార్నర్.
‘మా తరంలో లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీయే’ అని ఓ అభిమాని ప్రశ్నకి సమాధానం ఇచ్చిన వార్నర్... తన ఇంట్లో కూడా కోహ్లీకి అభిమానులున్నారని తెలిపాడు...
మీకు ఐసీసీ అవార్డులు రానందుకు ఏమీ ఫీల్ కావడం లేదా? అని మరో వ్యక్తి కామెంట్ చేయగా... దానికి ‘విరాట్ కోహ్లీతో ఎవ్వరూ పోటీపడలేరు’ అంటూ రిప్లై ఇచ్చాడు డేవిడ్ వార్నర్...
తాజాగా ఐసీసీ అవార్డ్స్ ఆఫ్ ది డికేట్‌లో తనకూ ఓ అవార్డు వచ్చిందంటూ ఓ ఫోటోను పోస్టు చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద కెప్టెన్...
‘ఐసీసీ మేల్ టిక్‌టాకర్ ఆఫ్ ది డికేట్’ అవార్డు వార్నర్‌కి వచ్చిందంటూ డేవిడ్ భాయ్ పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది...
‘మీ సపోర్టుకి థ్యాంక్స్’ అంటూ పోస్టు చేసిన డేవిడ్ వార్నర్... నాకు తెలిసి ఈ అవార్డుకి మనిద్దరం జాయింట్ విన్నర్స్ అంటూ యజ్వేంద్ర చాహాల్‌ని ట్యాగ్ చేశాడు...
ఎప్పటిలాగే క్రికెటర్ డేవిడ్ వార్నర్ పోస్టుకి ఎప్పటిలాగే వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. నిజంగానే క్రికెటర్‌కి ఈ అవార్డు వచ్చిందేమోనని కొందరు అభినందనలు తెలుపుతుండడంతో కామెంట్లలో ఇది నేనే తయారుచేశానంటూ క్లారిటీ ఇచ్చాడు డేవిడ్ వార్నర్.
మరోవైపు రెండో వన్డేలో గాయపడిన డేవిడ్ వార్నర్... మూడో టెస్టులో బరిలో దిగడం కూడా అనుమానమే అని తెలుస్తోంది. వార్నర్ ఫిట్‌నెస్‌పై ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొదటి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్, రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. అప్పటినుంచి క్రికెట్‌కి దూరమయ్యాడు వార్నర్.