MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్ 2025: 8 జట్లలో 5 జట్లకు ఇండియా-పాక్ ప్లేయర్లే కెప్టెన్లు

ఆసియా కప్ 2025: 8 జట్లలో 5 జట్లకు ఇండియా-పాక్ ప్లేయర్లే కెప్టెన్లు

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సారి టీ20 ఫార్మాట్ లో టోర్నీని నిర్వహిస్తున్నారు. ఆసియా కప్ లో పాల్గొన్న ప్లేయర్లలో 5 జట్లకు భారత, పాకిస్తాన్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నారు. విచిత్రంగా అనిపించినా ఇది నిజం ! 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 05 2025, 10:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆసియా కప్ 2025 సర్వం సిద్ధం
Image Credit : Getty

ఆసియా కప్ 2025 సర్వం సిద్ధం

ఆసియా కప్ 2025 కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంకా నాలుగు రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొత్తం 8 దేశాలు పోటీలో పాల్గొంటున్నాయి. అయితే, ఈసారి ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఐదు జట్లకు భారత్, పాకిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు.

DID YOU
KNOW
?
ఆసియా కప్ లో శ్రీలంక
ఇప్పటివరకు భారత జట్టు 8 సార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 6 సార్లు ఛాంపియన్ గా నిలిచిన శ్రీలంక రెండో స్థానంలో ఉంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒమన్ జట్టులో భారత మూలు
Image Credit : X/bcci

ఒమన్ జట్టులో భారత మూలు

భారత జట్టుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే భారత మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా మరో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పంజాబ్‌లోని లుధియానాలో పుట్టిన జతీందర్ సింగ్ ప్రస్తుతం ఒమన్ తరఫున ఆడుతున్నాడు. ఈసారి ఆసియా కప్‌లో ఒమన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో రెండు జట్లకు భారత ప్లేయర్లు కెప్టెన్లుగా ఉన్నారని చెప్పవచ్చు.

35
యూఏఈ, హాంకాంగ్ జట్లలో పాకిస్తానీ మూలాలు
Image Credit : Getty

యూఏఈ, హాంకాంగ్ జట్లలో పాకిస్తానీ మూలాలు

పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్. కానీ మరో రెండు జట్ల కెప్టెన్లు కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నవారు కావడం విశేషం. ముహమ్మద్ వసీమ్ యూఏఈ జట్టుకు కెప్టెన్. అతను పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం, ఖానేవాల్ జిల్లాలో పుట్టాడు. ఇప్పుడు యూఏఈ పౌరసత్వం పొంది ఆ దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యాసిమ్ ముర్తజా హాంకాంగ్ జట్టుకు కెప్టెన్. అతను కూడా పాకిస్తాన్‌లోని సియాల్కోట్‌లో పుట్టాడు. ఇప్పుడు హాంకాంగ్ జట్టును నడిపిస్తున్నాడు.

45
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 టోర్నమెంట్
Image Credit : x/Incognito Cricket

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 టోర్నమెంట్

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9న అబు ధాబీలో అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.

ఆసియా కప్ 2025 భారత జట్టు షెడ్యూల్

• సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ

• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్

• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్

సెప్టెంబర్ 20 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.

55
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు
Image Credit : Asianet News

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు

గతంలో ఉన్నట్లుగా ఈసారి భారత్‌లో ట్రైనింగ్ క్యాంప్ జరగలేదు. ఆటగాళ్లందరినీ నేరుగా దుబాయ్‌లో ఐసీసీ అకాడమీకి పంపించారు. సెప్టెంబర్ 5 నుంచి ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమవుతుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముందే దుబాయ్ చేరుకున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముంబై నుంచి బయల్దేరనున్నారు. వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ బెంగళూరు నుంచి బయలుదేరనున్నారు.

భారత జట్టు స్క్వాడ్

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్‌బై: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
పాకిస్తాన్
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
517 పరుగులు.. ఎవరూ ఊహించివుండరు.. టీ20 చరిత్రలో కొత్త రికార్డు
Recommended image2
టీమిండియా: ఆసియా కప్‌లో 5 అద్భుత రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved