చివరి ఓవర్ లో శ్రీలంక పై బంగ్లాదేశ్ థ్రిల్లింగ్ విక్టరీ
Bangladesh vs Sri Lanka: ఆసియా కప్ 2025 సూపర్ 4 తొలి మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. శ్రీలంకపై బంగ్లాదేశ్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సైఫ్ హాసన్ నిలిచాడు.

శ్రీలంక పై బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయం
ఆసియా కప్ 2025 సూపర్ 4 లో బంగ్లాదేశ్ ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్, శ్రీలంక తలపడ్డాయి. శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠను రేపుతూ సాగింది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన బంగ్లాదేశ్ జట్టు, గ్రూప్ దశలో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్, బౌలింగ్ ఎంచుకున్నాడు.
బంగ్లాదేశ్ vs శ్రీలంక బ్యాటింగ్ 168/7 (20 ఓవర్లు)
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక పవర్‌ప్లేలో మంచి స్కోర్ సాధించింది. నిస్సంకా, మెండిస్ దూకుడుగా ఆడటంతో 6 ఓవర్లకే శ్రీలంక 53/1 పరుగులు చేసింది. తస్కిన్ అహ్మద్, నిస్సంకాను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. మధ్య ఓవర్లలో మాహిదీ హసన్, నసుం అహ్మద్ స్పిన్‌తో ఒత్తిడి పెంచి మెండిస్ (34), మిశారా వికెట్లు తీశారు. దాసున్ శనకా చివరి ఓవర్లలో తుఫాను ప్రదర్శన చేసి 37 బంతుల్లో 64* (6 సిక్స్‌లు, 3 ఫోర్లు) సాధించాడు. ముస్తాఫిజుర్ రహమాన్ అద్భుత బౌలింగ్ చేసి 3/20 తీసి శ్రీలంకను 168/7కే పరిమితం చేశాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ చివరలో ఉత్కంఠ
ఛేజ్ ఆరంభంలో నువాన్ తుషారా తొలి ఓవర్‌లో తంజిద్ తమీమ్‌ను ఔట్ చేశాడు. కానీ లిటన్ దాస్, సైఫ్ హసన్ జాగ్రత్తగా ఆడి స్కోరును 6 ఓవర్లలోనే 59/1కి చేర్చారు. వనిందు హసరంగ స్పిన్‌తో తిరిగి శ్రీలంకను పోటీలోకి తెచ్చాడు. అతను లిటన్, సైఫ్ హసన్ (61) వికెట్లు తీశాడు.
చివరలో తౌహిద్ హ్రిదోయ్ దూకుడుగా ఆడుతూ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. షమీమ్ హొసేన్ కీలక సమయంలో ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించాడు. పరుగులు తక్కువగానే కావాల్సిన సమయంలో బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, చివరి ఓవర్‌లోనే బంగ్లాదేశ్ చివరి రెండో బంతికి విన్నింగ్ పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్ vs శ్రీలంక : మ్యాచ్ హైలెట్స్
• బంగ్లాదేశ్ బ్యాటింగ్: సైఫ్ హసన్ 61 పరుగులు (4 సిక్స్‌లు), తౌహిద్ హ్రిదోయ్ హాఫ్ సెంచరీ (58 పరుగులు), షమీమ్ హొసేన్ చివర్లో విలువైన ఇన్నింగ్స్ (14 పరుగులు)
• శ్రీలంక బౌలింగ్: వనిందు హసరంగ 4 ఓవర్లలో 2/22, నువాన్ తుషారా తొలి వికెట్.
• బంగ్లాదేశ్ బౌలింగ్: ముస్తాఫిజుర్ రహమాన్ 3/20, మాహిదీ హసన్ 2/25, మధ్య ఓవర్లలో స్పిన్‌తో ఫైట్.