MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా క‌ప్ 2024 : సెమీ ఫైన‌ల్ లో బంగ్లాపై 10 వికెట్ల తేడాతో సూప‌ర్ విక్ట‌రీ.. ఫైన‌ల్ లోకి టీమిండియా

ఆసియా క‌ప్ 2024 : సెమీ ఫైన‌ల్ లో బంగ్లాపై 10 వికెట్ల తేడాతో సూప‌ర్ విక్ట‌రీ.. ఫైన‌ల్ లోకి టీమిండియా

Asia Cup 2024 semi-final : ఆసియా క‌ప్ 2024 తొలి సెమీ ఫైన‌ల్ లో బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా అద్బుత విజయాన్ని అందుకుంది. దీంతో భారత జట్టు ఫైనల్ కు చేరుకుని మరో రికార్డును సృష్టించింది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 26 2024, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Asia Cup 2024, Team India, India

Asia Cup 2024, Team India, India

Asia Cup 2024 semi-final : ఆసియా క‌ప్ 2024 లో భార‌త మ‌హిళ క్రికెట్ జ‌ట్టు జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస విజ‌యాల‌తో భార‌త జ‌ట్టు ఐసీసీ ట్రోఫీని అందుకోవ‌డానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. శుక్ర‌వారం సెమీ ఫైన‌ల్ లో భ‌ర‌త జ‌ట్టు బంగ్లాదేశ్ తో త‌ల‌ప‌డింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
India Women vs Bangladesh Women, India ,

India Women vs Bangladesh Women, India ,

ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. త‌న ఆల్ రౌండ్ షోతో బంగ్లాదేశ్ టీమ్ ను చిత్తుగా ఓడించింది. శ్రీలంక‌లోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో భార‌త బౌల‌ర్లు అద్భుత‌మైన బౌలింగ్ లో అద‌ర‌గొట్టారు. ఆ త‌ర్వాత బ్యాట‌ర్లు ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడి భార‌త జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. 

35
Women's Asia Cup 2024,  India,

Women's Asia Cup 2024, India,

బంగ్లాదేశ్ పై విజ‌యంతో భార‌త జ‌ట్టు ఆసియా క‌ప్ లో అత్య‌ధిక సార్లు ఫైన‌ల్ కు చేరిన జ‌ట్టుగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ నిర్ణ‌యం బంగ్లాదేశ్ కు భారీ షాకిచ్చింది. ఆట ఆరంభం నుంచే భారత బౌల‌ర్లు సూప‌ర్ బౌలింగ్ వ‌రుస‌గా వికెట్లు తీసుకున్నారు. 

45

తొలి ఓవ‌ర్ లోనే రేణుకా సింగ్ బంగ్లా ఓపెనింగ్ బ్యాట‌ర్ దిలార అక్త‌ర్ ను ఔట్ చేశారు. ఈ మ్యాచ్  మొత్తం మంచి బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసిన రేణుకా ఠాకూర్ సింగ్ మొత్తం మూడు వికెట్లు తీసుకున్నారు. అలాగే, భార‌త బౌల‌ర్ల‌లో రాధా యాదవ్ కూడా మ‌రోసారి బాల్ తో మెరిశారు. కీల‌క‌మైన మూడు వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్ టీమ్ కు షాకిచ్చింది. 

 

55

భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాటర్లలో వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ నిగర్ సుల్తానా 32 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నారు. 81 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు కేవ‌లం 11 ఓవ‌ర్లలోనే విజ‌యాన్ని అందుకుంది. భార‌త బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన 55 ప‌రుగులు, షఫాలీ వర్మ 26 ప‌రుగుల‌తో అజేయంగా విజ‌యాన్ని అందించారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved