స్కూల్ పిల్లల కంటే దారుణంగా ఆడారు! కావాలనే ఓడిపోయినట్టుంది.. ఇండియా- పాక్ మ్యాచ్‌పై పాక్ మాజీ కామెంట్స్..
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆల్‌రౌండ్ విభాగాల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. గ్రూప్ స్టేజీలో భారత టాపార్డర్‌ని ముప్పు తిప్పలు పెట్టిన పాకిస్తాన్ బౌలర్లు, సూపర్ 4 మ్యాచ్‌లో రెండంటే రెండే వికెట్లు తీశారు..
Naseem Shah of Pakistan
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ అజేయ సెంచరీలతో అదరగొడితే రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేశారు..
India vs Pakistan
ఈ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హారీస్ రౌఫ్, నసీం షా గాయాలతో బ్యాటింగ్‌కి రాకపోవడంతో 9 మంది బ్యాటర్లు మాత్రమే బ్యాటింగ్ చేశారు. 228 పరుగుల భారీ తేడాతో భారత జట్టుకి ఘన విజయం దక్కింది..
‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో బాగా ఆడాలంటే కనీసం ఆసియా కప్ ఫైనల్ ఆడాలి. ఇలాంటి ఆటతీరుతో కనీసం నెదర్లాండ్స్‌పైన కూడా గెలవలేరు. అసలు మేనేజ్‌మెంట్ ఏం చేస్తోంది..
బ్యాటింగ్ పిచ్‌పైన టాస్ గెలిచి ఎవ్వడైనా బౌలింగ్ తీసుకుంటాడా? కనీసం ఆలౌట్ కాకుండా అన్ని ఓవర్లు ఆడి ఉంటే అయినా నెట్ రన్ రేట్‌కి ఉపయోగపడేది. ఇదే కాదు, బంగ్లాతోనూ ఇలాగే ఆడారు..
190 పరుగులు ఛేదించడానికి 40 ఓవర్లు తీసుకున్నారు. ఎలా ఆడాలో, టీమ్‌కి ఏం కావాలో మెసేజ్‌ల ద్వారా ప్లేయర్లకు చెప్పండి. షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్ అవుటైన విధానం అయితే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది..
గెలవకపోయినా 250 పరుగులు చేసి పూర్తి ఓవర్లు బ్యాటింగ్ చేసినా, టీమ్ పొజిషన్ బాగుండేది. ఓ గేమ్ ప్లాన్ లేదు, ఓ అప్రోచ్ లేదు. ప్రతీ ఒక్కరూ ఏదో హాలీడేకి వచ్చినట్టుగా క్రీజులోకి వచ్చి వెళ్లారు.
స్కూల్ పిల్లల కంటే దారుణంగా ఆడారు.. ఏదో ఆడాలని ఇష్టలేకపోయినా, ఆడాలి కాబట్టి ఆడుతున్నట్టుగా ఉంది. బౌలర్లు నిజంగా గాయపడ్డారా? నాకు అనుమానమే. చూస్తుంటే పాక్, కావాలనే ఓడిపోయినట్టుంది.. ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న పాకిస్తాన్, శ్రీలంకతో జరిగే సూపర్ 4 మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా, లేదా వర్షంతో ఫలితం తేలకుండా ఆట రద్దు అయినా పాకిస్తాన్ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఇండియాతో శ్రీలంక, ఆసియా కప్ 2023 ఫైనల్ ఆడుతుంది..