- Home
- Sports
- Cricket
- బాబర్ ఆజమ్ ప్లేస్‌లో వేరే కెప్టెన్ ఉండి ఉంటే, 170కి ఆలౌట్ అయ్యేవాళ్లు! - సునీల్ గవాస్కర్
బాబర్ ఆజమ్ ప్లేస్‌లో వేరే కెప్టెన్ ఉండి ఉంటే, 170కి ఆలౌట్ అయ్యేవాళ్లు! - సునీల్ గవాస్కర్
వన్డేల్లో నెం.1 టీమ్‌గా ఆసియా కప్ 2023 టోర్నీని ఆరంభించింది పాకిస్తాన్. ఆఫ్ఘాన్‌ని వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్, అంతకుముందు నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి టీమ్స్‌పై తన ప్రతాపం చూపించింది. నేపాల్‌పై 238 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది..

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, టాపార్డర్ వైఫల్యంతో 66 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు..
అయితే ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్‌కి 138 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించి, టీమిండియాని ఆదుకున్నారు. జస్ప్రిత్ బుమ్రా 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేయడంతో 200 కూడా దాటడం కష్టమేననుకున్న భారత జట్టు, 266 పరుగులు చేయగలిగింది..
‘బాబర్ ఆజమ్ చేసిన బౌలింగ్ మార్పులు నాకు వింతగా అనిపించాయి. పాక్‌కి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. పేస్ బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీశారు. అయినా సరే బాబర్ ఆజమ్ వాళ్లను కొనసాగించడానికి ప్రాధాన్యం ఇవ్వలేదు..
పాక్ బౌలర్లు లాంగ్ స్పెల్స్ వేయలేరా? అలా అనుకున్నా ముగ్గురిలో ఓ బౌలర్‌ని ఓ ఎండ్‌లో కొనసాగించొచ్చు కదా. మరో ఎండ్‌లో షాదబ్, నవాజ్‌లతో బౌలింగ్ వేయించి ఉంటే సరిపోయేది. పాకిస్తాన్ కెప్టెన్ చేసిన తప్పులు, టీమిండియాకి కలిసి వచ్చాయి..
66 పరుగులకే 4 వికెట్లు పడిన తర్వాత 175-200 కూడా చేరడం కష్టమేనని అనుకున్నా. అయితే బాబర్ ఆజమ్ కెప్టెన్సీ తప్పిదాలతో టీమిండియా 266 పరుగులు చేయగలిగింది. భారత జట్టుకి ఇది పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది..
ఎందుకంటే రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ త్వరగా అవుటైనా 260+ పరుగులు చేయడమంటే చాలా పెద్ద అఛీవ్‌మెంట్ కిందే లెక్క. ఎప్పుడూ ఆ ముగ్గురే కొట్టాలంటే అయ్యే పని కూడా కాదు. మిడిల్ ఆర్డర్‌ని పరీక్షించడానికి ఇలాంటి మ్యాచులు కూడా అవసరం..’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..