- Home
- Sports
- Cricket
- జడేజా లేనప్పుడు దినేశ్ కార్తీక్‌ని ఆడించడమే కరెక్ట్ కదా... రాహుల్ ద్రావిడ్‌కి షోయబ్ అక్తర్ కౌంటర్...
జడేజా లేనప్పుడు దినేశ్ కార్తీక్‌ని ఆడించడమే కరెక్ట్ కదా... రాహుల్ ద్రావిడ్‌కి షోయబ్ అక్తర్ కౌంటర్...
ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియాకి ఎదురైన ఒక్క ఓటమి, అంతకుముందు సాధించిన రెండు విజయాలను మరిచిపోయేలా చేసింది. సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది భారత జట్టు. ఈ ఓటమి కారణంగా అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు...

పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. జడేజా గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీకి దూరం కావడంతో పాక్‌తో మ్యాచ్‌లో అతని స్థానంలో దీపక్ హుడాని ఆడించింది టీమిండియా మేనేజ్‌మెంట్...
ఆల్‌రౌండర్ జట్టులోకి వచ్చిన దీపక్ హుడా.. బ్యాటుతో పెద్దగా మెప్పించలేకపోయాడు. యజ్వేంద్ర చాహాల్, హార్ధిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇస్తున్నా దీపక్ హుడాకి ఒక్క ఓవర్ ఇచ్చే సాహసం చేయలేదు కెప్టెన్ రోహిత్ శర్మ...
మొదటి రెండు మ్యాచుల్లో ఆడిన సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ని పక్కనబెట్టి యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని కొనసాగించింది టీమిండియా. ఇది కూడా భారత జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది. రిషబ్ పంత్ బ్యాటుతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు...
‘టీమిండియాకి ఇంకా కాంబినేషన్ విషయంలో కంఫ్యూజన్ కొనసాగుతున్నట్టు నాకు అనిపిస్తోంది. ఆసియా కప్ లాంటి కీలక టోర్నీలో ప్లేయింగ్ ఎలెవన్ ఎప్పుడూ సెటిల్‌గా ఉండాలి. మరీ అవసరమైతే తప్ప మార్పులు చేయడం కరెక్ట్ కాదు...
రవీంద్ర జడేజా గాయపడిన తర్వాత దినేశ్ కార్తీక్ లాంటి సీనియర్ ప్లేయర్ తుదిజట్టులో ఉంటే బాగుండేది. దినేశ్ కార్తీక్‌ని మొదటి రెండు మ్యాచుల్లో ఆడించి, ఆ తర్వాత ఎందుకు కూర్చోబెట్టారు. అసలు దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, దీపక్ హుడాల్లో ఎవరిని ఎక్కువ మ్యాచుల్లో కొనసాగించాలని అనుకుంటున్నారు...
Image credit: Getty
టీమ్ కాంబినేషన్ విషయంలో కనీసం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి అయినా క్లారిటీ ఉందా? లేక లాటరీ తీసినట్టు ఈ మ్యాచ్ నువ్వు, ఈ మ్యాచ్ అతను అని డిసైడ్ చేస్తున్నారా... జట్టు ఎంపిక విషయంలో మేనేజ్‌మెంట్‌లో కంఫ్యూజన్ ఉన్నట్టు తెలుస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్...
కొందరు క్రికెట్ విశ్లేషకులు కూడా షోయబ్ అక్తర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. ప్రతీ మ్యాచ్‌కి టీమ్‌ని మారుస్తూ ఉంటే ప్లేయర్లకు తాము ఏ మ్యాచ్‌లో ఆడతామో, ఏ మ్యాచ్‌లో ఆడమో అనే విషయం తెలియక ఏకాగ్రత కోల్పోతారని, ఇది టీమ్ పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపుతుందని అంటున్నారు కొందరు టీమిండియా ఫ్యాన్స్..