బుద్ధిగా ఉండండి... కరోనా సోకినా ఇష్టారాజ్యంగా పాక్ క్రికెటర్లు... మరో క్రికెటర్‌కి కరోనా పాజిటివ్!
First Published Nov 28, 2020, 4:47 PM IST
న్యూజిలాండ్‌తో టీ20, టెస్టు సిరీస్ కోసం కివీస్ గడ్డ మీద పాక్ క్రికెట్ జట్టుకి షాక్ తగిలింది. న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన 25 మంది క్రికెటర్లలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా సోకిన ఆరుగురిలో ఇద్దరు ఎప్పటినుంచో కరోనాతో బాధపడుతున్నట్టు రిపోర్టులో రావడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. కరోనా సోకిన క్రికెటర్లను ఐసోలేషన్‌కి తరలించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, మిగిలిన క్రికెటర్లను క్వారంటైన్‌లో ఉంచింది.

కరోనా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ సిరీస్ ఆడాలనే క్రికెటర్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతున్న టీమిండియా 14 రోజుల పాటు క్వారంటైన్ పీరియడ్ పూర్తిచేసుకుంది.

పాకిస్థాన్ సూపర్ లీగ్ పూర్తి చేసుకున్న పాక్ క్రికెటర్లు, కివీస్‌తో మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు ఆడేందుకు న్యూజిలాండ్ చేరుకున్నారు. వీరికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆరుగురికి కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?