- Home
- Sports
- Cricket
- వన్డే వరల్డ్ కప్‌కి ముందు టీ20 సిరీస్‌లు ఎందుకు? రోహిత్, ద్రావిడ్‌లను కలవనున్న చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్
వన్డే వరల్డ్ కప్‌కి ముందు టీ20 సిరీస్‌లు ఎందుకు? రోహిత్, ద్రావిడ్‌లను కలవనున్న చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇప్పటికే సైరన్ మోగింది. అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌కి రెండున్నర నెలల సమయం మాత్రమే ఉంది. అయితే టీమిండియా మాత్రం ఇప్పటిదాకా వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌ని సరైన రీతిలో ప్లాన్ చేసినట్టు కనిపించడం లేదు..

ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా, రెండో టెస్టు ముగిసిన తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడే భారత జట్టు, అటు నుంచి ఐర్లాండ్ వెళ్లి అక్కడ మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతుంది..
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు మినహాయిస్తే వన్డే జట్టుకి ఆడే శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ వంటి ప్లేయర్లు అందరూ కూడా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడబోతున్నారు...
వెస్టిండీస్ టూర్ తర్వాత ఐర్లాండ్‌లో జరిగే టీ20 సిరీస్‌లో కూడా వీళ్లంతా పాల్గొనే అవకాశం పుషల్కంగా ఉంది. మరి వన్డే వరల్డ్ కప్ పరిస్థితి ఏంటి? ఐర్లాండ్ టూర్ ముగిసిన తర్వాత శ్రీలంకలో ఆసియా కప్ 2023 టోర్నీ మ్యాచులు ఆడుతుంది భారత జట్టు.. అప్పటిదాకా సీనియర్లకు రెస్ట్ ఇవ్వాల్సిందేనా..
ఆసియా కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లు ఉంటుంది. అయితే ఇప్పటిదాకా ఈ సిరీస్ షెడ్యూల్ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అజిత్ అగార్కర్, వెస్టిండీస్ టూర్‌కి బయలుదేరబోతున్నాడు..
భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాలను కలిసి వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ రోడ్ మ్యాప్ గురించి చర్చించబోతున్నాడు అజిత్ అగార్కర్. ఈ మీటింగ్‌లో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసే జట్టుపైన కూడా చర్చలు జరగబోతున్నాయి..
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసే జట్టులో, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి, అవసరమైతే ఆ సమయంలో వేరే టీమ్‌తో వన్డే సిరీస్ నిర్వహించాలని... అదీ కుదరకపోతే ప్రపంచ కప్ కోసం క్యాంపు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాడట అజిత్ అగార్కర్..
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ... సరైన ప్లాన్ లేకుండా ఫ్లోలో ఫాలో అయిపోతూ వెళ్లాలని ఆలోచిస్తుంటే కొత్త ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని చాలా సీరియస్‌గా తీసుకున్నాడని సమాచారం..