MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL: చెన్నైకి ఊహించని షాక్ ఇచ్చిన షేన్ వాట్సన్.. చక్రం తిప్పిన రికీ పాంటింగ్

IPL: చెన్నైకి ఊహించని షాక్ ఇచ్చిన షేన్ వాట్సన్.. చక్రం తిప్పిన రికీ పాంటింగ్

Shane Watson Gives Shock To MS Dhoni: మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కావాల్సి ఉండగా.. సీఎస్కే సారథి ధోనికి నమ్మకస్తుడిగా ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఆ జట్టుకు ఊహించని షాకిచ్చాడు. 

1 Min read
Author : Srinivas M
Published : Feb 23 2022, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్-15 ప్రారంభానికి కొద్దిరోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్  కు ఆ జట్టు మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ ఊహించని షాకిచ్చాడు. ఇన్నాళ్లు  ధోనికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న వాట్సన్ ఇప్పుడు  చెన్నైని వీడనున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వచ్చే సీజన్ నుంచి  వాట్సన్ ఢిల్లీ  క్యాపిటల్స్ తో చేరనున్నట్టు తెలుస్తున్నది.  ఈ మేరకు ఢిల్లీ హెడ్ కోచ్  రికీ పాంటింగ్ చక్రం తిప్పాడు

37

గతంలో కొన్నాళ్ల పాటు సీఎస్కే తరఫున ఆడిన  వాట్సన్ కు ధోనితో సత్సంబంధాలున్నాయి. ధోని, రైనా, బ్రావో, జడేజా,  వాట్సన్, డుప్లెసిస్.. ఇలా చెన్నైకి ఓ కోర్ గ్రూప్ ఉండేది. 

47

కానీ వాట్సన్ రిటైర్ కావడం.. ఈ వేలంలో సీఎస్కే రైనాను దక్కించుకోకపోవడంతో పాటు యువ ఆటగాళ్లపై ఎక్కువగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ధోనికి తోడుగా వాట్సన్ ఉంటాడని అందరూ భావించారు. ఆటగాడిగా రిటైరైనా వాట్సన్ మాత్రం  కోచింగ్ స్టాఫ్ గా వస్తాడని అంతా భావించారు.

57

అందరి అంచనాలను తలకిందులు  చేస్తూ వాట్సన్.. సీఎస్కేకు షాకిచ్చాడు.   రాబోయే సీజన్ నుంచి అతడు ఢిల్లీకి అసిస్టెంట్ కోచ్ గా మారనున్నాడు.  ఈ మేరకు ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్  చక్రం తిప్పాడు.  అసిస్టెంట్ కోచ్ గా ఉండేందుకు వాట్సన్ ను  పాంటింగ్ ఒప్పించాడు. 

67

40 ఏండ్ల వాట్సన్.. మహ్మద్ కైఫ్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు.  ఈ ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ గతంలో 2008 లో రాజస్థాన్ రాయల్స్, 2018లో  చెన్నై ఐపీఎల్ విజేతగా నిలిచినప్పుడు  ఆ జట్లలో సభ్యుడు.

77

ఢిల్లీ కోచింగ్ స్టాఫ్ ఇదే : రికీ పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ : షేన్ వాట్సన్, ప్రవీణ్ తామ్రే, అజిత్ అగార్కర్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : జేమ్స్ హోప్స్, టీమ్ స్కౌట్ అండ్ అడ్వైజర్ : సబా కరీం.

About the Author

SM
Srinivas M
ఎం.ఎస్. ధోని
రిషబ్ పంత్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Most Centuries: సచిన్ నుంచి కోహ్లీ వరకు.. క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Virat Kohli: రిటైర్మెంట్ పై అభిమానుల గుండె పగిలే వార్త చెప్పిన కోహ్లీ
Recommended image3
Virat Kohli: విరాట్ కోహ్లీ విధ్వంసం.. ఒకే సెంచరీతో 10 సంచలన రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved