- Home
- Sports
- Cricket
- వన్డేల్లో రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్న అజింకా రహానే... వెస్టిండీస్ టూర్ తర్వాత...
వన్డేల్లో రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్న అజింకా రహానే... వెస్టిండీస్ టూర్ తర్వాత...
శ్రేయాస్ అయ్యర్ గాయపడడం, ఐపీఎల్ పర్పామెన్స్ కారణంగా 17 నెలల గ్యాప్ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు అజింకా రహానే. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోన రాణించిన ఏకైక భారత బ్యాటర్ రహానే మాత్రమే...

తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసిన అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి అమూల్యమైన 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసిన అజింకా రహానే, విరాట్ కోహ్లీ (49) తర్వాత టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు..
Ajinkya Rahane
టీమిండియాలోకి ఘనమైన రీఎంట్రీ చాటుకున్న అజింకా రహానే, వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోవడం గ్యారెంటీ. శ్రేయాస్ అయ్యర్ పూర్తిగా కోలుకోకపోవడంతో రహానేకి సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వొచ్చు...
అయితే అజింకా రహానే మాత్రం వన్డే ఫార్మాట్‌లో ఇచ్చేందుు గట్టిగా ప్లాన్ వేస్తున్నాడట. టీమిండియా తరుపున 90 వన్డేలు ఆడి 2962 పరుగులు చేసిన అజింకా రహానే, 2018లో ఆఖరి వన్డే ఆడాడు. స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే కారణంగానే రహానేని వన్డే ఫార్మాట్‌కి దూరం పెట్టేసింది టీమిండియా...
Ajinkya Rahane
ఐపీఎల్ 2023 సీజన్‌లో 200 ప్లస్ స్ట్రైయిక్ రేటుతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అజింకా రహానే, వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత రాయల్ లండన్ కప్‌లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఇంగ్లాండ్ క్లబ్ లీసెస్టర్‌షైర్‌తో రహానే ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు..
Ajinkya Rahane
వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత అటు నుంచి లండన్‌కి చేరుకునే అజింకా రహానే, సెప్టెంబర్ వరకూ రాయల్ లండన్ కప్‌లో లీసెస్టర్‌షైర్ క్లబ్ తరుపున వన్డే మ్యాచులు ఆడబోతున్నాడు. ఈ టోర్నీలో బాగా ఆడి, సెలక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నాడట అజింకా రహానే..
Image credit: PTI
వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీతో పాటు శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా సెటిల్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్‌ని వన్డే ఫార్మాట్‌లో ఇరికించాలని టీమిండియా ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు...
Shreyas Iyer
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్, వరుసగా 3 మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కూడా తరుచుగా గాయపడుతూ ఉండడంతో అజింకా రహానే, రాయల్ లండన్ కప్‌లో బాగా ఆడితే... టీమ్‌లో అవకాశం దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు..