- Home
- Sports
- Cricket
- కెప్టెన్సీ పోయాక ఆడాలనే ఇంట్రెస్ట్ కూడా పోయ్యిందా... 8 నెలల్లో 5 సిరీస్‌లకు దూరమైన విరాట్ కోహ్లీ...
కెప్టెన్సీ పోయాక ఆడాలనే ఇంట్రెస్ట్ కూడా పోయ్యిందా... 8 నెలల్లో 5 సిరీస్‌లకు దూరమైన విరాట్ కోహ్లీ...
విరాట్ కోహ్లీకి రన్ మెషిన్ మాత్రమే కాదు, ఫిట్‌నెస్ ఐకాన్ అనే నిక్‌నేమ్ కూడా ఉంది. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి 14 ఏళ్లు దాటినా విరాట్ కోహ్లీ, ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకి దూరంగా ఉన్న మ్యాచులు నాలుగంటే నాలుగే. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది...

Image credit: Getty
చేతికి 8 కుట్లు పడిన తర్వాత బ్యాటింగ్‌కి దిగి, సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు విరాట్ కోహ్లీ. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ తీరు పూర్తిగా మారిపోయింది...
2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ వివిధ కారణాలతో ఏకంగా ఐదు సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఫిట్‌గా ఉండి, కేవలం ఆడకూడదని నిర్ణయించుకుని, రెస్ట్ తీసుకున్న సిరీస్‌లే కావడం మరో విశేషం...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకి కూడా దూరమయ్యాడు...
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ఆడని విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కూడా ఆడలేదు. ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో బిజీగా ఉండడంతో ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌కి అందుబాటులో లేడు...
Virat Kohli
ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టు ఆడిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 ఆడలేదు. గాయం కారణంగా తొలి వన్డేకి కూడా అందుబాటులో లేడు...
Virat Kohli
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడని విరాట్ కోహ్లీ, టీ20 సిరీస్ నుంచి కూడా రెస్ట్ తీసుకున్నాడు. తాజాగా జింబాబ్వే టూర్‌కి ఎంపిక చేసిన జట్టులోనూ విరాట్ పేరు కనిపించలేదు... దీంతో ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...
Image credit: Getty
ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ ఆడాలని తపన పడే విరాట్ కోహ్లీ, ఇలా విశ్రాంతి పేరుతో జట్టుకి దూరం అవుతుండడంతో కెప్టెన్సీ పోయిన తర్వాత అతనికి ఆడాలనే ఆసక్తి కూడా పోయిందా... అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...
ఫామ్‌లో లేనప్పుడు సాధ్యమైనంత ఎక్కువ మ్యాచులు ఆడుతూ, ప్రాక్టీస్ సెషన్స్‌లో ఎక్కువ సేపు గడుపుతూ తిరిగి ఫామ్‌లోకి రావడం విరాట్ కోహ్లీకి అలవాటు. 2014 ఇంగ్లాండ్ టూర్‌లో ఘోర ఫెయిల్యూర్ తర్వాత విరాట్ ఇలాగే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు...
Image credit: Getty
అయితే ఇప్పుడు విరాట్‌లో మునుపటి ఫైర్ కనిపించడం లేదు. క్రికెట్‌లో ఇప్పటికే 70 సెంచరీలు చేయడంతో ఇక చాలు, తాను సాధించాల్సింది ఇంకేమీ లేదని మైండ్‌సెట్‌లోకి విరాట్ కోహ్లీ వెళ్లిపోయినట్టు కనిపిస్తోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు...
వన్డే కెప్టెన్సీ కోల్పోవడం, బీసీసీఐతో విభేదాలతో క్రికెట్‌పై విరక్తి పెంచుకున్నాడని మరికొందరు అంటుంటే... అన్నింటికీ మించి తన ఏడాది కూతురు వామికతో ఎక్కువ సమయం గడిపేందుకు విరాట్ కోహ్లీ ఇలా రెస్ట్ తీసుకుంటున్నాడని మరికొందరు అంటున్నారు...
అయితే జింబాబ్వే టూర్ ముగిసిన తర్వాత జరిగే ఆసియా కప్ 2022కి అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ, బీసీసీఐకి తెలియచేసినట్టు సమాచారం. ఆసియా కప్‌తో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలను భారత జట్టుకి అందించడమే తన తదుపరి లక్ష్యమని విరాట్ కోహ్లీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే..