- Home
- Sports
- Cricket
- అప్పుడు నీమ్ కరోలీ బాబా, ఇప్పుడు ఉజ్జయినీ... విరాట్ కోహ్లీకి బాగా కలిసి వస్తున్న ఆధ్యాత్మిక యాత్రలు...
అప్పుడు నీమ్ కరోలీ బాబా, ఇప్పుడు ఉజ్జయినీ... విరాట్ కోహ్లీకి బాగా కలిసి వస్తున్న ఆధ్యాత్మిక యాత్రలు...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌ని రెండు భాగాలుగా విభజించాల్సి వస్తే... అది 2019కి ముందు, 2022 తర్వాత అని విడదీయాల్సి ఉంటుంది. మధ్యలో ఉన్న మూడేళ్లు కూడా పరుగులు చేయలేక, బీసీసీఐతో విభేదాలతో డార్క్ పీరియడ్‌ని అనుభవించాడు విరాట్ కోహ్లీ...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Image: Google
కెరీర్ ఆరంభంలో తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మతో పెళ్లి తర్వాత మారాడు. పెళ్లి తర్వాత ప్రతీ మగాడిలో ఎంతో కొంత మార్పు వస్తుంది, అందుకు విరాట్ కోహ్లీయేం మినహాయింపు కాదు...
Virat Kohli Anushka Sharma In Rishikesh Ashram
అయితే లాక్‌డౌన్ బ్రేక్, ఆ తర్వాత మూడేళ్ల పాటు సెంచరీలు చేయలేక పేలవ ఫామ్, బీసీసీఐతో విబేధాలు, కెప్టెన్సీ కోల్పోవడం వంటి విషయాలు... విరాట్ కోహ్లీని మానసికంగా ఎంతో కృంగదీశాయి. ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటడానికి కూడా ఎంతో ఇబ్బందిపడిన విరాట్ కోహ్లీ, నెలన్నర రోజుల పాటు క్రికెట్‌కి బ్రేక్ తీసుకున్నాడు...
Image credit: PTI
ఆసియా కప్ 2022 టోర్నీలో, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చిన విరాట్ కోహ్లీ... పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌కి విజయాన్ని అందించాడు.
ఇంతకుముందు టైమ్ దొరికితే మాల్దీవులు, దుబాయ్ చక్కేసి విహార యాత్రలు చేసే విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఆధ్యాత్మిక దారిలో నడుస్తున్నాడు. నవంబర్‌లో కుటుంబంతో కలిసి నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో మూడో టెస్టుకి ముందు ఉజ్జయినీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు..
ఈ రెండు సందర్భాల్లో కూడా విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగడం విశేషం. బాబాను దర్శించుకున్న తర్వాత విరాట్ కోహ్లీ బీభత్సమైన ఫామ్‌ని అందుకుని నాలుగు మ్యాచుల్లో మూడు సెంచరీలు బాదేశాడు.
దీంతో అంతా బాబా మహత్యమేనని కోహ్లీ అభిమానులు, నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి క్యూ కట్టారు... ఇప్పుడు మూడేళ్ల తర్వాత టెస్టుల్లో సెంచరీ చేయడానికి ఉజ్జయినీ మహాకాళేశ్వరుడే కారణమని అంటున్నారు నెటిజన్లు..
అయితే విరాట్ కోహ్లీని కరుణించిన మహాకాళేశ్వరుడు, కెఎల్ రాహుల్‌ని మాత్రం కరుణించకపోవడం విశేషం. మూడో టెస్టు ముగిసిన తర్వాత భార్య అథియా శెట్టితో కలిసి ఉజ్జయినీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు కెఎల్ రాహుల్. అయితే రాహుల్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు..