దద్దరిల్లిన ఢిల్లీ.. కోహ్లీతోని అట్లుంటది మరి !
Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చాడు. అతను గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే కోహ్లీ కోహ్లీ.. ఆర్సీబీ ఆర్సీబీ అంటూ స్టేడియం హోరెత్తింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Virat Kohl: భారత స్టార్ బ్యాట్స్‌మెన్, సూపర్ స్టార్ కింగ్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతున్నారు.
తద్వారా భారత స్టార్ బ్యాట్స్‌మెన్ 12 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చాడు. ఇక కోహ్లీ రాకతో స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్ ను తలపించేలా పూర్తిగా క్రికెట్ లవర్స్ తో నిండిపోయింది.
Image Credits: Twitter
విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు
విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతాడు. అతను తన చివరి రంజీ ట్రోఫీని ఢిల్లీ తరపున నవంబర్ 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో ఆడాడు. విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత తిరిగి మళ్లీ దేశవాళీ టోర్నీలోకి వచ్చాడు.
ఇటీవల భారత జట్టు ఘోర ప్రదర్శన నేపథ్యంలో వీలైనప్పుడల్లా భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ బీసీసీఐ నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో కోహ్లీ, రోహిత్ లతో పాటు భారత జట్టు ప్లేయర్లు దేశవాళీ టోర్నీలో ఆడుతున్నారు.
ఈ టోర్నీలో 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ రంజీ ట్రోఫీ నాకౌట్‌లోకి ప్రవేశించడం కష్టతరమైన తరుణంలో విరాట్ కోహ్లీ పునరాగమనం జరిగింది. నాలుగో స్థానంలో ఉన్న రైల్వేస్‌పై ఢిల్లీకి పూర్తి విజయం అవసరం, కానీ నాకౌట్‌లోకి ప్రవేశించడానికి ఇది సరిపోదు.
Image Credit: Twitter
ఆర్సీబీ ఆర్సీబీ.. నినాదాలతో హోరెత్తిన ఢిల్లీ స్టేడియం
రంజీ ట్రోఫీలో ఆడుతున్న కోహ్లీని చూసేందుకు భారీగా అభిమానులు, క్రికెట్ లవర్స్ వచ్చారు. ఈ మ్యాచ్ జరుగుతున్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోకి అడుగుపెట్టేందుకు అభిమానులు తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు.
స్డేడియంలో భారీ సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు.. కోహ్లీ కోహ్లీ, ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలతో స్టేడియం మార్మోగింది. భారత మాజీ కెప్టెన్ అయిన కోహ్లీపై తమ మక్కువను మరోసారి ప్రదర్శించారు. చాలా మంది రావడంతో గేట్ నంబర్ 16, 17 తెరిచిన తర్వాత గేట్ నంబర్ 18ని కూడా తెరిచినట్లు డీడీసీఏ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ కెప్టెన్ యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోని
ఈ మ్యాచ్ లో టీమ్ ను గమనిస్తే జాంటీ సిద్ధూ స్థానంలో విరాట్ కోహ్లీ ఢిల్లీ టీమ్ లోకి వచ్చాడు. రిషబ్ పంత్ స్థానంలో ప్రణబ్ రాజ్‌వంశీ, ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్ష్ త్యాగి స్థానంలో ఫాస్ట్ బౌలర్ మణి గ్రేవాల్‌ని తీసుకున్నారు.
అదే సమయంలో రెగ్యులర్ కెప్టెన్ ప్రథమ్ సింగ్ గాయం కారణంగా అందుబాటులో లేనందున, రైల్వేస్ కెప్టెన్సీని సూరజ్ అహుజా తీసుకున్నాడు. ఢిల్లీకి యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
రెండు జట్ల ప్లేయింగ్ 11 :
ఢిల్లీ: సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, విరాట్ కోహ్లీ, ఆయుష్ బదోని (కెప్టెన్), ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, నవదీప్ సైనీ, మణి గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ.
రైల్వేస్: అంచిత్ యాదవ్, వివేక్ సింగ్, మహ్మద్ సైఫ్, సూరజ్ అహుజా (కెప్టెన్), ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), భార్గవ్ మెరాయ్, కర్ణ్ శర్మ, అయాన్ చౌదరి, హిమాన్షు సాంగ్వాన్, కునాల్ యాదవ్, రాహుల్ శర్మ.