యువరాజ్ సింగ్ సరసన చేరిన అభిషేక్ శర్మ
Abhishek Sharma equals Yuvraj Singhs record: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో యువరాజ్ సింగ్ రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు.

యువరాజ్, అభిషేక్ శర్మ
5 టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్ జట్టులో జోష్ బట్లర్ మాత్రమే అర్ధ సెంచరీ (44 బంతుల్లో 68 పరుగులు) చేశాడు. మిగతా ఆటగాళ్లు ఎవరూ 20 పరుగులు దాటలేదు. తమిళనాడుకు చెందిన భారత జట్టు ఆటగాడు వరుణ్ చక్రవర్తి అద్భుత బౌలింగ్‌ను తట్టుకోలేక ఇంగ్లిష్ ఆటగాళ్లు సులువుగా వికెట్లు జారవిడుచుకున్నారు. వరుణ్ చకరవర్తి 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు.
అభిషేక్ శర్మ బ్యాటింగ్
అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 13 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగులతో టార్గెట్ ను అందుకుంది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు యాక్షన్‌తో టీమిండియా తన ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. క్లాసిక్ షాట్లతో బౌండరీల బాదిన సంజూ శాంసన్ 20 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఎండ్ లో నిలదొక్కుకున్న యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ.. ప్రపంచ ఫాస్టెస్ట్ బౌలర్లు మార్క్ వుడ్, జోబ్రా ఆర్చర్ లను చిత్తు చేస్తూ సిక్సర్ల మోత మోగించాడు.
మార్క్ వుడ్ బౌలింగ్ తో అద్భుతమైన సిక్సర్లు బాదాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. తన ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 5 బౌండరీలు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయి టీ20 మ్యాచుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఇండియా vs ఇంగ్లాండ్ టి20
యువరాజ్ సింగ్ రికార్డును సమం చేసిన అభిషేక్ శర్మ
ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో ఫిఫ్టీ సాధించి ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన 2వ భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. దీంతో యువరాజ్ సింగ్ రికార్డును కూడా సమం చేశాడు. అయితే, మొత్తంగా ఇంగ్లాండ్ పై ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు యూవీ పేరుమీద ఉంది. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అద్భుతమైన రికార్డు సాధించాడు.
టీ20ల్లో భారతీయ క్రికెటర్ సాధించిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా ఇదే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువరాజ్ సింగ్ ఏకంగా ఆరు సిక్సర్లు బాదాడు.
గెట్టి ఇమేజెస్
గురువును మించిన శిష్యుడు
యువరాజ్ సింగ్ తర్వాత, అభిషేక్ శర్మ ఇంగ్లండ్‌పై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. యువరాజ్ సింగ్‌కు అభిషేక్ శర్మ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ‘యువరాజ్ సింగ్ యాక్షన్ చూసి యాక్షన్ ప్లేయర్ అయ్యాను’ అని అభిషేక్ శర్మ పలు సందర్బాల్లో చేప్పిన సంగతి తెలిసిందే.
Abhishek Sharma
ఇంగ్లండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా అభిషేక్
అభిషేక్ శర్మ జూలై 2024లో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. అరంగేట్రం సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీ సాధించాడు. అయితే, దీని తర్వాత అతని ప్రదర్శన హెచ్చు తగ్గులతో నిండిపోయింది. అయితే తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా అభిషేక్ ఘనత సాధించాడు.
ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఇరు జట్లు జనవరి 25న రెండో టీ20లో తలపడనున్నాయి.