MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్‌లో డివిలియర్స్ ఫేవరేట్ ప్లేయర్ అతడే.. కోహ్లీకి దక్కని చోటు..

ఐపీఎల్‌లో డివిలియర్స్ ఫేవరేట్ ప్లేయర్ అతడే.. కోహ్లీకి దక్కని చోటు..

IPL 2023:  ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ పేరు చెబితే అభిమానులకు గుర్తొచ్చేది  విరాట్ కోహ్లీ - ఏబీ డివిలియర్స్ విన్యాసాలే. ఈ ఇద్దరూ ఆ జట్టు బ్యాటింగ్‌కు మూల స్తంభాలు. కానీ అలాంటి డివిలియర్స్...

2 Min read
Author : Srinivas M
Published : May 29 2023, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సౌతాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీకి దశాబ్దంపాటు సేవలందించిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్..  ఆర్సీబీ  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో కలిసి ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. సుమారు దశాబ్దకాలం పాటు ఈ ఇద్దరూ ఆర్సీబీ బ్యాటింగ్‌కు వెన్నెముకలా ఉండేవారు.  వృత్తిగతంగానే గాక    డివిలియర్స్.. కోహ్లీలు ఫ్యామిలీపరంగా కూడా మంచి మిత్రులు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ డివిలియర్స్  మాత్రం ఐపీఎల్ - 2023 తన ఫేవరేట్ ప్లేయర్ లిస్ట్ లో కోహ్లీని చేర్చలేదు. అలాగని కోహ్లీ ఈ సీజన్ లో ఆడలేదా..? అంటే అదీ లేదు.   ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ..  14 మ్యాచ్ లలోనే  53.25 సగటుతో  ఏకంగా 625 పరుగులు చేశాడు. ఇందులో  బ్యాక్ టు బ్యాక్  సెంచరీలు కూడా ఉన్నాయి. 

36

రికార్డులు తిరగరాస్తూ   ఐపీఎల్ లో ఏడు వేల పరుగులు, ఏడు సెంచరీలు చేసిన  కోహ్లీ కంటే తనకు రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్  యశస్వి జైస్వాల్  ఫేవరేట్  ప్లేయర్ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.  రాబోయే రోజుల్లో అతడు సూపర్  స్టార్ గా మారుతాడని  తెలిపాడు. 

46
Image credit: PTI

Image credit: PTI

జియో సినిమాలో జరిగిన ఓ కార్యక్రమంలో డివిలియర్స్ మాట్లాడుతూ..  ‘నా వరకైతే ఈ ఐపీఎల్ సీజన్ లో ఫేవరేట్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. రాబోయే రోజుల్లో అతడు సూపర్ స్టార్ అవుతాడు.  ఈ యువ ఓపెనర్ అన్ని షాట్లను ఆడగలడు.   క్రీజులో ప్రశాంతంగా ఉంటూనే దూకుడైన ఆట ఆడటంలో  అతడు ఎక్స్‌పర్ట్.  నాకు అది చాలా నచ్చింది. 
 

56

ఇన్నింగ్స్ ఆది నుంచే బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ  ధాటిగా ఆడటంలో  యశస్వి దిట్ట.  దాంతో అతడు పరిస్థితులను తన కంట్రోల్ లోకి తెచ్చుుకుంటాడు.  శుభ్‌మన్  కంటే యశస్వి ఇంకా చాలా యంగ్.  ఫ్యూచర్ లో సూపర్ స్టార్ గా ఎదగడానికి జైస్వాల్ కు అన్ని లక్షణాలు ఉన్నాయి..’ అని మిస్టర్ 360 చెప్పాడు. 

66

కాగా ఈ సీజన్ లో  జైస్వాల్..  రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 14 మ్యాచ్ లలో  జైస్వాల్..  48.08 సగటుతో  625 పరుగులు చేశాడు.  ఇందులో ఓ సెంచరీతో పాటు ఐదు అర్థ సెంచరీలున్నాయి.  కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో  జైస్వాల్.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 

About the Author

SM
Srinivas M
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Recommended image2
భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌.. 55 ప‌రుగుల‌కే కుప్పకూలిన పాకిస్థాన్ జ‌ట్టు
Recommended image3
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved