MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • అప్పట్లా కాదు, ఇప్పుడు మనోళ్లే ఫెవరెట్! బుమ్రా ఉండి ఉంటేనా... టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై రవిశాస్త్రి

అప్పట్లా కాదు, ఇప్పుడు మనోళ్లే ఫెవరెట్! బుమ్రా ఉండి ఉంటేనా... టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై రవిశాస్త్రి

వరుసగా రెండో సీజన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతోంది భారత జట్టు. అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు, ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలో దిగనుంది. అప్పటికీ, ఇప్పటికీ ఏం మారింది? టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 05 2023, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Virat Kohli Rohit Sharma

Virat Kohli-Rohit Sharma

‘గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోతే ఆ బాధ ఎప్పటికీ అలాగే ఉంటుంది. కేవలం ఓ మ్యాచ్ ఆడామని చెప్పుకోవడానికి ఎవ్వరూ ఆడరు, విజయం కోసం ఆడతారు, గెలవాలని ఆడతారు. విజయం రానప్పుడు కచ్చితంగా బాధ కలుగుతుంది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ పూర్తిగా వేరు. ఎందుకంటే 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. కోవిడ్ కారణంగా కఠినమైన ఆంక్షలు ఉండేవి...

36
Virat Kohli

Virat Kohli

14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నాం, ఐసోలేషన్‌లో గడిపాం. ప్రాక్టీస్ సెషన్స్‌ సమయంలో కూడా కఠినమైన ఆంక్షలు, నిబంధనలు ఉండేవి. ఆటగాళ్లకు ఏ మాత్రం స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆటగాళ్లకు స్వేచ్చ వచ్చింది..

46

శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, అజింకా రహానే అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు, ఫ్రీగా ఆడుతున్నారు. అందుకే అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనోళ్లే ఫెవరెట్. అయితే  ఫైనల్ మ్యాచ్‌లో ఫిట్‌నెస్‌దే కీ రోల్... 

56

6 గంటల పాటు నిలబడుతూ ఫీల్డింగ్ చేయాలంటే ఫిట్‌గా ఉండడం తప్పనిసరి. నెట్స్‌లో బౌలింగ్ చేయడం, ఫైనల్‌లో బౌలింగ్ చేయడం ఒక్కటి కాదు. ఫిట్‌నెస్ పరంగా చూస్తే ఇండియా కంటే ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువ...
 

66

జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌గా ఉండి ఉంటే, కచ్చితంగా ఆస్ట్రేలియా కంటే టీమిండియా బౌలింగ్ అటాక్ భీకరంగా ఉండేది. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలతో బుమ్రా కలిస్తే...ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్‌ కంటే ప్రమాదకరంగా మారేది. అయితే ఇప్పుడు అలా లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
GT vs SRH: పూర్తిగా చేతులెత్తేసిన స‌న్‌రైజ‌ర్స్‌.. గుజ‌రాత్ దెబ్బకు చిత్తు
Recommended image2
Virat Kohli: కోహ్లీపై భారీ కుట్ర‌.. కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన జ‌ర్మ‌న్ మోడ‌ల్
Recommended image3
IPL 2026 Playoff Scenarios: ప్లేఆఫ్స్ రేస్ లో నిలిచేది ఎవరు? చెన్నైకి ఛాన్సుందా? ఆ 3 టీమ్స్ దాదాపు ఫిక్స్! లెక్కలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved