టీ, భోజన విరామమే కాదు... ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యోగా బ్రేక్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాము పనిచేసే చోటే కొద్దిసేపు యోగా చేసుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పించింది.
Yoga Break
న్యూడిల్లీ : అన్ని కార్యాలయాల్లోనూ టీ, భోజనం విరామం వుంటుంది... కానీ కేంద్ర ప్రభుత్వం కార్యాలయాల్లో మాత్రం వీటితో పాటు యోగా బ్రేక్ కు వుండనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేసే ఆఫీసుల్లోనే యోగా చేసుకునే అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పించింది. ఈ మేరకు యోగా బ్రేక్ ను ఉపయోగించుకోవాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ ప్రకటన జీవో జారీ చేసింది.