- Home
- Cartoon Punch
- సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబ్ పెట్టా... తమిళనాడు పోలీసులకు చెమటలు పట్టించిన దివ్యాంగుడు
సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబ్ పెట్టా... తమిళనాడు పోలీసులకు చెమటలు పట్టించిన దివ్యాంగుడు
స్టాలిన్ ఇంట్లో బాంబ్ పెట్టా... తమిళనాడు పోలీసులకు చెమటలు పట్టించిన దివ్యాంగుడు
11

cartoon punch
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబ్ పెట్టానని... ఏ క్షణమయినా అది పేలవచ్చంటూ ఓ దివ్యాంగుడు పోలీసులకు చెమటలు పట్టించాడు. చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు ఫోన్ చేసిన 28ఏళ్ల అయ్యప్పన్ స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టానని బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు, సీఎం భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబ్ స్వాడ్ సాయంతో సీఎం నివాసమంతా జల్లెడపట్టినా బాంబు జాడ లభించలేదు. దీంతో ఇది ఫేక్ కాల్ గా గుర్తించిన పోలీసులు అయ్యప్పన్ ఈ పనిచేసినట్లు నిర్దారించుకున్నారు. అతడిని అరెస్ట్ చేసారు.
Latest Videos