మాంసాహార ప్రియులకు షాక్... భారీగా పెరిగిన చికెన్ ధర

First Published Mar 9, 2021, 2:01 PM IST

హైదరాబాద్: సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధరలు తెలంగాణలో అమాంతం పెరిగిపోయాయి. బర్డ్‌ఫ్లూ ప్రచారంతో కొంతకాలంగా పడిపోయిన చికెన్ ధరలు మళ్లీ పైపైకి దూసుకువెళుతున్నాయి. గత ఆదివారం కిలో చికెన్ ధర రూ. 250 దాకా పలికింది. దీంతో చికెన్ షాపుకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడిపోతున్నారు.