టీకా ఉత్సవ్ తో కోవిడ్-19పై రెండో యుద్ధం: ప్రధాని మోదీ

First Published Apr 12, 2021, 4:49 PM IST

కోవిడ్-19 నిరోధానికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను యుద్దప్రాతిపదికన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. టీకా ఉత్సవాలు కోవిడ్-19పై రెండో యుద్ధానికి నాంది అని ప్రధాని పేర్కొన్నారు.  కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో టీకా ఉత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రకటించారు. ఈక్రమంలోనే గత ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.