ఇదొక్కరోజే కాదు... ప్రజల్ని ప్రతిరోజూ ఫూల్స్ చేస్తున్న సోషల్ మీడియా

First Published Apr 1, 2021, 1:04 PM IST

హైదరాబాద్: సోషల్ మీడియా రాకతో నిజమేదో, అబద్దమేదో తెలియడం లేదు. ఎవరికి అనుకూలంగా వారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం వరకు బాగానే వున్నా ప్రత్యర్ధులపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. ఇలా ఒక్క రాజకీయాల్లోనే కాదు సినిమాలు, క్రీడలు ప్రతి రంగానికి సంబంధించిన ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారమవుతూ ప్రజలను ప్రతిరోజూ ఫూల్స్ చేస్తున్నాయి. కాబట్టి స్పెషల్ గా మనల్ని ఏప్రిల్ ఫూల్ ను చేయాల్సిన అవసరం లేదు.