మళ్లీ కరోనా విజృంభణ... కొన్ని రాష్ట్రాల్లో భయానక పరిస్థితి

First Published Feb 23, 2021, 11:39 AM IST

కరోనా వైరస్ ప్రభావం దేశంలో కాస్త తగ్గినట్లే తగ్గి ఇటీవల మళ్లీ విజృంభిస్తోంది. వ్యాక్సిన్ రాకతో ఇక మహమ్మారి బెడద వుండదని భావించిన ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తుండటంతో కేసుల సంఖ్య మెల్లిగా పెరుగుతూ వస్తోంది. మాస్కులు, శానిటైజర్ల వాడకాన్ని నిలిపివేసిన ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం లేదు. దీంతో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది.