సినీ నటుడు సోనూ సూద్ కు కరోనా పాజిటివ్...
ముంబై: తనకు కరోనా వైరస్ సోకిన విషయాన్ని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా వేదికగా అభిమానులతో, అనుచరులతోనూ పంచుకున్నారు. తన మూడ్, స్ఫూర్తి బాగుందని ఆయన చెప్పారు. ఈ రోజు ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందని, దాంతో సెల్ఫ్ ఐసోషలేషన్ లోకి వెళ్లానని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి తగిన సమయాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. మీ కోసం నేను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటాననే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన చెప్పారు.
11

<p>cartoon punch</p>
cartoon punch
Latest Videos