అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ కార్స్ కలెక్షన్.. చూస్తే వావ్ అనల్సిందే..
యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఇందులో ప్రజాస్వామ్య అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బిడెన్ జూనియర్ నవంబర్ 7న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైట్ హౌస్ గెలవడానికి అవసరమైన 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 270 కన్నా ఎక్కువ ఓట్లను జో బిడెన్ పొందగలిగాడు. అయితే ఈ వార్తా అమెరికన్ రాజకీయాల గురించి కాదు. యూఎస్‌ఏ 46వ అధ్యక్షుడు జో బిడెన్ కు కార్లు అంటే ఎంతో ప్రేమ, అతని వద్ద ఉన్న కార్ల కలెక్షన్ చూస్తే మీరు అవాక్కవుతారు..
అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ కార్లలో మధ్యలో పుట్టి పెరిగాడు. జో బిడెన్ తండ్రి డెలావేర్లో 34 సంవత్సరాల పాటు కార్ డీలర్‌షిప్స్ నిర్వహించాడు. ఇందులో ఎక్కువగా క్రిస్లర్ కార్లు ఉండేవి, తరువాత కొంతకాలం ఫోర్డ్ కార్ల కార్యకలాపాలను కూడా నిర్వహించాడు.
జో బిడెన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా మొట్టమొదటి కారు 1951 స్టూడ్‌బేకర్, దీని తరువాత 1952 ప్లైమౌత్ కన్వర్టిబుల్- ఇది స్వీట్ -ఆపిల్ ఎరుపు రంగులో స్ప్లిట్ విండ్‌షీల్డ్‌తో ఉంటుంది. కాలేజీ రోజుల్లో 1956 చేవ్రొలెట్, మెర్సిడెస్ బెంజ్ 190 ఎస్ఎల్ ఉన్నట్లు తెలిపాడు.
అతని 1967 చేవ్రొలెట్ కొర్వెట్టి గుడ్వుడ్-ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది 327 క్యూబిక్-అంగుళాల V8 మోటారుతో 350 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. కన్వర్టిబుల్ కారును 1967 ఆగస్టులో అతని తండ్రి జో బిడెన్ పెళ్లికి బహుమతిగా ఇచ్చాడు, ఇది ఇప్పటికీ అతనితోనే ఉంది.
అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు, జో బిడెన్ ఒబామా పరిపాలనలో ఉపాధ్యక్షునిగా పనిచేశారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ కాడిలాక్ లిమోసిన్లో ప్రయాణించేవారు. కొన్ని నియమాల ప్రకారం అధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి పదవీకాలంలో కార్లు నడపడానికి అనుమతించరు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా అతను మరోసారి ఆ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.