దీపావళికి మీ డ్రీం కార్ లేదా బైక్ కొంటున్నారా.. షోరూమ్‌కు వెళ్లేముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి ..
కరోనా వ్యాప్తి సామాజిక దూరం కారణంగా ప్రజలు ప్రజా రవాణా కంటే సొంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్టోబర్‌లో దసరా, దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. ప్రజలు తమ కలల వాహనం కొనుగోలు సమయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు, కానీ వాటి గురించి పూర్తిగా సమాచారం తేలుసున్నాక మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. కొత్త కారు లేదా బైక్‌ను కొనడం అంత సులభం కాదు ఇందుకు ఆలోచన, సమాచారం, దాని వివరాలు తేలుసుకోవడం ఉత్తమం. మీ కలల వాహనం కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ...
మీరు కారు లేదా బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా, చాలా మంది రుణం మీద కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అందువల్ల మీ ఆదాయం, ఖర్చులను ఒకసారి క్షుణ్ణంగా తేలుసుకోండి. తరువాత డౌన్ పేమెంట్ కోసం బడ్జెట్‌ను సిద్ధం చేసుకోండీ. మీరు ఈఎంఐ చెల్లింపులలో ఆలస్యం జరిగితే మీ సిబిల్ స్కోరు ప్రభావితమవుతుంది. బైక్ బుకింగ్ చేయడానికి ముందు ఈఎంఐ పూర్తి వివరాలు తెలుసుకొని కుటుంబం లేదా స్నేహితుల నుండి సలహాలు తీసుకోండి.
వాహనం కొనడానికి ముందు మీరు మీ అవసరాలకు ప్రధానం ఇవ్వాలి, ఇంటర్నెట్ లేదా వార్తాపత్రికల సహాయంతో మీకు సరిపడా వాహనం సెలెక్ట్ చేసుకోండీ. ఇంజన్ సామర్థ్యం, మైలేజ్, ట్రాన్స్మిషన్ (గేర్ బాక్స్) గురించి బాగా అవగాహన పెంచుకోండి.
మీ అవసరాలను బట్టి పెట్రోల్ వాహనం లేదా డీజిల్ వాహనం, మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకోవాలో నిర్ణయం తీసుకోండి. ఇంజన్ కాన్ఫిగరేషన్ గురించి సమాచారం, ఆన్‌లైన్ రివ్యూ చదవడం కూడా మీకు చాలా సహాయపడుతుంది.
మీరు ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే తక్కువ సిసి ఇంజన్‌తో బైక్ లేదా స్కూటర్ కొనడం తెలివైన మార్గం. దీపావళి పండుగ సీజన్ లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే, కంపెనీలు వాహనాలపై అత్యధిక డిస్కౌంట్లను అందిస్తున్నాయి. లేటెస్ట్ ఆఫర్‌ల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.
కొత్త కారు లేదా బైక్ కొనడానికి ముందు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కార్-బైక్ రివ్యూలు చదవండి, వాటి నుండి సమాచారాన్ని తేలుసుకోండి. ప్రతి ఒక్కరి అవసరాలు భిన్నంగా ఉన్నందున, ఒకొక్కరూ ఒక్కో ఫీచర్లను ఇష్టపడవచ్చు, కానీ నచ్చిన ఫీచర్స్ కోసం టెస్ట్ డ్రైవ్ చేయండి. ఇది మీకు స్పష్టమైన విషయాలను తెలియజేస్తుంది. టెస్ట్ డ్రైవ్ సమయంలో అన్ని విధాలా డ్రైవ్ చేయండి, తద్వారా మీరు కంఫర్ట్ లెవెల్, పనితీరు గురించి మంచి ఆలోచన పొందవచ్చు.