ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం! టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలో మీటర్ల కంటే ఎక్కువదూరం ప్రయాణించగల సామర్థ్యం గల అత్యుత్తమ ఎలక్ట్రిక్ SUVలు మార్కెట్ లో వున్నాయని మీకు తెలుసా? ఇలాాంటి కార్ల వివరాలు మీకోసం...
ఎలక్ట్రిక్ కార్లు
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్ బాగా వృద్దిచెందుతోంది... భవిష్యత్ లో ఇది ఊహించని స్థాయికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం పర్యావరణానికి చాలా మేలుచేసే అంశం. అంతేకాదు ఇందన ఖర్చులు తగ్గి ఆర్థికభారం తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ SUV లు ఆధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి... కొన్ని కార్లలో ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 500 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఇలాంటి టాప్ ఎలక్ట్రిక్ SUV కార్ల గుర్తించి తెలుసుకుందాం.
Chevrolet Equinox EV
1. షెవర్లేట్ ఈక్వినాక్స్ EV
షెవర్లేట్ ఈక్వినాక్స్ EV ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) రెండింటిలోనూ వస్తుంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) మోడల్ ఒకేసారి ఛార్జ్‌తో 513 కి.మీ వరకు వస్తుంది.(EPA రేటింగ్ ప్రకారం)
Chevrolet Blazer EV
2. షెవర్లేట్ బ్లేజర్ EV
బ్లేజర్ EV ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి. ఒకేసారి ఛార్జ్‌తో ఇది 513 కి.మీ. ప్రయాణిస్తుంది.
Tesla Model X
3. టెస్లా మోడల్ X SUV
ప్రత్యేకమైన డిజైన్‌కు పేరుగాంచిన టెస్లా మోడల్ X SUV, డ్యూయల్-మోటార్ AWD సెటప్, స్పోర్టి 20-అంగుళాల వీల్స్ తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఒకేసారి ఛార్జ్‌తో 524 కి.మీ. వరకు ప్రయాణించగలదు.
Rivian R1S EV
5. రివియన్ R1S ఎలక్ట్రిక్ SUV
రివియన్ R1S ఎలక్ట్రిక్ SUV ప్రపంచంలోనే అత్యధిక మైలేజ్ కలిగిన SUV లలో ఒకటి. ఈ విలాసవంతమైన కారు అత్యాధునిక ఫీచర్లతో నిండి ఉంది, ఇది ఒకేసారి ఛార్జ్‌తో 659 కి.మీ. వరకు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.