MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Top 10 Selling Cars : 2025లో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు, వాటి ధరలు

Top 10 Selling Cars : 2025లో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు, వాటి ధరలు

Top 10 Best Selling Cars in 2025 : భారతదేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కేవలం జనవరి 2025 ఒక్క నెలలోనే దేశంలో ఎన్నికార్లు అమ్ముడుపోయాయో తెలుసా? అందులోనూ అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లేవో తెలుసా? 

4 Min read
Author : Arun Kumar P
| Updated : Feb 22 2025, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Top 10 Selling Cars in 2025

Top 10 Selling Cars in 2025

Top 10 Selling Cars in 2025 : ఒకప్పుడు కారు అనేది లగ్జరీ... కానీ ప్రస్తుతం ఇది నిత్యావసరంగా మారిపోయింది. మారుతున్న కాలాన్ని బట్టి మనిషి అవసరాలు కూడా మారుతున్నాయి... ఈ క్రమంలోనే కారు నిత్యావసరాల్లో చేరిపోయింది. తమ కుటుంబం కోసం కొందరు... స్టేటస్ కోసం ఇంకొందరు... ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం మరికొందరు కార్లను కొనుగోలు చేస్తున్నారు. గతంలో బైక్స్ మాదిరిగా ఇప్పుడు కార్లు మారాయి. 

కార్ల తయారీ కంపనీల మధ్య పోటీ పెరిగింది...దీంతో తమ వాహనాల సేల్ పెంచుకునేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇలా జీరో డౌన్ పేమెంట్, ఈజీ ఈఎంఐ ఆప్షన్, తక్కువ ధరకే అందిస్తుండటంతో కార్ల అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన కారును కొనేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు.

ఇలా గతేడాది భారీగా కార్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది (2025) కేవలం ఒక్క నెల మాత్రమే ముగిసింది... రెండో నెల కూడా పూర్తికాలేదు. అప్పుడు లక్షలాది కార్లు అమ్ముడుపోయాయి. ఏ కంపనీ, ఏ మోడల్, ఎన్ని కార్లు అమ్ముడుపోయాయో వివరాలు వచ్చాయి. ఇలా జనవరి 2025 లో అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు ఏవో తెలుసుకుందాం.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Wagon R

Wagon R

జనవరి 2025 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లు :

1. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R) :

గత నెల జనవరిలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ టాప్ లో నిలిచింది. చాలాకాలంగా మార్కెట్ లో ఉన్న ఈ మోడల్ సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది... మిడిల్ క్లాస్ కారుగా గుర్తింపుపొందింది. గతేడాది 2024 లో రికార్డు స్థాయిలో ఈ మోడల్ అమ్ముడుపోయింది... ఈ రికార్డును ఈ ఏడాది 2025 లో కూడా కొనసాగిస్తోంది. జనవరి 2025 లో ఏకంగా 24,078 వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడుపోయాయి. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.5.54 - 7.33 లక్షలు
 

311
Baleno

Baleno

2. మారుతి సుజుకి బలేనో (Maruti Suzuki Baleno) :

జనవరి 2025 లో అత్యధికంగా అమ్ముడుపోయిన వాహనాల్లో రెండో స్థానం కూడా మారుతిదే. మారుతి సుజుకి బలేనో మోడల్ కార్లు గత నెలలో 19,965 అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. భారత అటోమోటివ్ రంగంలో బలేనోకు ప్రత్యేక గుర్తింపు ఉంది... ఇదికూడా సామాన్యులకు బాగా దగ్గరైన కారు. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.66 - 9.84 లక్షలు
 

411
Creta

Creta

3. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) :

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న SUV కార్లలో హ్యుందాయ్ క్రెటా టాప్ లో ఉంది.  మొత్తంగా చూసుకుంటే హ్యుందాయ్ కార్లలో అధిక డిమాండ్ ఉన్న కారు ఇదే. గత నెల జనవరి 2025 లో 18,522 క్రెటా కార్లు అమ్ముడుపోయాయి.

ఎక్స్ షోరూమ్ ధర : రూ.11 - 20.30 లక్షలు
 

511
Swift

Swift

4. మారుతి సుజుకి స్విప్ట్ (Maruti Suzuki Swift) :

మారుతి సుజుకి లో టాప్ సేల్స్ కలిగిన కార్లలో స్విప్ట్ ఒకటి. 2005 లో విడుదలైన ఈ కారు గత 20 ఏళ్లుగా మార్కెట్ లీడర్ గా నిలుస్తోంది... రెండు దశాబ్దాలుగా ఇంత నిలకడగా సేల్స్ ఉండటం మామూలువిషయం కాదు. జనవరి 2025 లో కూడా ఈ స్విప్ట్ మోడల్ 17,081 విక్రయించబడ్డాయి. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.49 - 9.59 లక్షలు
 

611
TATA Punch

TATA Punch

5. టాటా పంచ్ (TATA Punch) :

ఇటీవల కాలంలో మార్కెట్ లోకి వచ్చిన కార్లలో వినియోగదారులకు బాగా నచ్చినవాటిలో టాటా పంచ్ ఒకటి. 2021 లో మార్కెట్ లోకి వచ్చిన ఈ కారు బాగా సక్సెస్ అయ్యింది. కేవలం జనవరి 2025 అంటే ఒక్క నెలలోనే 16,231 టాటా పంచ్ కార్లు అమ్ముడుపోయాయి. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.13 - 10.15 లక్షలు
 

711
Grand Vitara

Grand Vitara

6. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) :

మారుతి సుజుకి నుండి వచ్చిన మరో అద్భుతమైన కారు గ్రాండ్ విటారా. అద్భుతమైన లుక్, మంచి ఫర్ఫార్మెన్స్ కలిగిన ఈ కారు అత్యధికంగా అమ్ముడుపోయేవాటి జాబితాలో ఉంది. జనవరి 2025 లో 15,784 గ్రాండ్ విటారా కార్లు అమ్ముడుపోయాయి. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.11.19 - 20.09 లక్షలు
 

811
Scorpio

Scorpio

7. మహింద్రా  స్కార్మియో (Mahindra Scorpio) :

ఒకప్పుడు ఆటోమోటివ్ రంగాన్ని ఏలిన కార్లలో మహింద్రా స్కార్పియో ఒకటి. ఇటీవల ఈ కారు సరికొత్త హంగులతో మళ్ళీ మార్కెట్ లోకి వచ్చింది. రాజసం ఉట్టిపడేలా గ్రాండ్ లుక్ కలిగిన ఈ SUV ఎంతగానో ఆకట్టుకుంటోంది. జనవరి 2025 లో ఈ న్యూ స్కార్పియో 15,442 యూనిట్లు అమ్ముడుపోయాయి. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.13.62 - 17.42 లక్షలు
 

911
NEXON

NEXON

8. టాటా నెక్సాన్ (TATA NEXON) :

టాటా నుండి వచ్చిన మరో ఫ్యామిలీ కారు టాటా నెక్సాన్. మంచి ఔట్ లుక్ తో, అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తూనే తన మార్క్ చూపించింది. గత జనవరి 2025 ఏకంగా 15,397 టాటా నెక్సాన్ కార్లు అమ్ముడుపోయాయి. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.8 - 15.50 లక్షలు
 

1011
Swift DZIRE

Swift DZIRE

9. మారుతి సుజుకి స్విప్ట్ డిజైర్ (Maruti Suzuki Swift DZIRE) :

సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో మారుతి సుజుకి డిజైర్ టాప్ లో ఉంటుంది. గత జనవరి 2025 లో ఈ స్విప్ట్ డిజైర్ 15,383 యూనిట్లు అమ్ముడుపోయాయి. 

ఎక్స్ షోరూమ్ ధర : రూ.6.57 - 9.34 లక్షలు

1111
fronx

fronx

10. మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti suzuki fronx) :

మారుతి సుజుకి నుండి వచ్చిన మరో మోడల్ ఫ్రాంక్స్ కూడా మార్కెట్ లో మంచిస్థానమే సాధించింది. జనవరి 2025 లో 15,192 ఫ్రాంక్స్ కార్లు అమ్ముడుపోయాయి. 

 ఎక్స్ షోరూమ్ ధర : రూ.7.51 - 13.04 లక్షలు
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Best Mileage Tata Cars: 33 కిలో మీటర్లు.. అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 టాటా కార్లు ఇవే.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
Recommended image2
Maruti Suzuki Offers: మారుతి సుజుకి కార్లపై రూ.1.40 లక్షల వరకు తగ్గింపు.. స్విఫ్ట్, ఆల్టో, వ్యాగన్ ఆర్‌, విక్టోరిస్ పై బంపర్ ఆఫర్లు
Recommended image3
Denza Z9 GT: కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్.. కళ్ళు మూసి తెరిచేలోపే 100 కి.మీ వేగం.. సూపర్ కారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved