కొత్త టాటా నెక్సాన్ అమ్మకాలు రెట్టింపు.. ఇండియాలో బెస్ట్ సెల్లర్ గా టాటా మోటార్స్..
టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. టాటా మోటార్స్ ఇండియా గర్వించదగిన కారుగా కొత్త ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ నిలిచింది.
ఇందుకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీల అమ్మకాలలు గణనీయంగా పెరగటం. గతనెల ఆగస్టులో మారుతి బ్రిజెగా 5,000 కార్లను విక్రయించింది. కానీ టాటా నెక్సాన్ అమ్మకాల వృద్ధి మాత్రం రెట్టింపు అయింది.
టాటా మోటార్స్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లలో నెక్సాన్ కార్ల అమ్మకాలు 100 శాతం పెరిగాయి. ఆగస్టు 2020లో టాటా నెక్సాన్ 5,179 యూనిట్లను విక్రయించింది.
టాటా నెక్సాన్ కార్ల అమ్మకాలు 2019 ఆగస్టుతో పోల్చితే ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. గత సంవత్సరం 2019 ఆగస్టులో 2,275 నెక్సాన్ కార్లు అమ్ముడయ్యాయి.
2020 ఆగస్టులో టాటా మోటార్స్ ఇండియాలో రెండవ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఇందుకు న్యూ నెక్సాన్ కార్ల అమ్మకాలు 5వేల మార్కును దాటడం నిదర్శనం.
టాటా నెక్సాన్ ఇప్పుడు భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 (2,990 యూనిట్లు), ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (2,757 యూనిట్లు), హోండా డబ్ల్యూఆర్-వి (729 యూనిట్లు) కార్ల అమ్మకాలను మించిపోయింది.
కంపెనీ ఇటీవల నెక్సాన్‌కు ఎక్స్‌ఎమ్ (ఎస్) వేరియంట్‌ను విడుదల చేసింది, దీని ధర రూ.8.36 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢీల్లీ). దీనికి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. దీనికి ఆటో హెడ్లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఎన్నో ఫీచర్స్ కూడా ఉన్నాయి.