ఇండియాలో ఈ కారు ఎంత సురక్షితమైనదో తెలుసుకోండి.. క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్..
ఇటీవల లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ తక్కువ సమయంలోనే అత్యంత పాపులరిటీతో, అద్భుతమైన బుకింగ్స్ అందుకుంది. నిస్సాన్ మాగ్నైట్ ఇటీవల ఏఎస్ఈఏఎన్ ఎన్‌సిఎపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారు భద్రతకు సంబంధించిన పూర్తి భద్రతా క్రాష్ టెస్ట్ వివరాలు ఇప్పుడు బయటికొచ్చాయి.
గత సంవత్సరం 2020లో ఎన్‌సిఏపి టెస్ట్ నిర్వహించిన రెండవ ఎస్‌యూవి నిస్సాన్ మాగ్నైట్. నిస్సాన్ మాగ్నైట్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఏఓపి)లో 39.02 పాయింట్లు సాధించడంతో ఈ ఎస్‌యూవి విజయవంతమైంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సిఓపి)లో 16.31 పాయింట్లు, సేఫ్టీ అసిస్ట్ విభాగంలో 15.28 పాయింట్లు పొందింది.
ఏఎస్ఈఏఎన్ ఎన్‌సిఎపి సేఫ్టీ టెస్ట్ క్రాష్ రిపోర్ట్ (అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీ) ప్రకారం కారు ముందు భాగంలో ఢీకొన్నట్లయితే డ్రైవర్ ఛాతీకి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు ముందు సీటుపై కూర్చున్న ప్రయాణీకుడికి ఛాతీ, కాళ్ళకు కీంద తగిన రక్షణ కల్పించారు.
నిస్సాన్ మాగ్నైట్ భద్రతా ఫీచర్లు
నిస్సాన్ మాగ్నైట్ కారు భద్రత విషయంలో చాలా భద్రతా ఫీచర్స్ తీసుకుంది. కారుకు 2 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్ గా లభిస్తాయి, అంటే డ్రైవర్ తో పాటు ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ కి కూడా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇది కాకుండా కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఇఎస్సి), సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ ఉంది. ముందు సీట్లో కూర్చున్న ప్రయాణీకుల కోసం అన్ని వేరియంట్లలో ఇది స్టాండర్డ్ గా వస్తుంది.
ఇది కాకుండా ఈ 5-సీట్ల ఎస్‌యూవీ ఐసోఫిక్స్, టాప్ టీథర్ స్టాండర్డ్‌గా వస్తుంది, ఇది అన్ని వేరియంట్లకు ఇవ్వబడ్డాయి. కారు భద్రతా ఫీచర్స్ లో ఎబిఎస్ విత్ ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్, 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటర్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. నిస్సాన్ మాగ్నైట్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ మూడు విభాగాల మొత్తం స్కోరు ఆధారంగా 70.60 పాయింట్లతో 4-స్టార్ ఎన్‌సిఎపి రేటింగ్‌ను పొందింది.
ధర ఎంత?
నిస్సాన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్ ధరలను కొత్త సంవత్సరం నుండి పెంచాయి. గత ఏడాది 2020లో కంపెనీ ఈ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ .4.99 లక్షలకు లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు దాని బేస్ వేరియంట్ ధర పెరిగింది, దీని బేస్ వేరియంట్ ధర ఇప్పుడు 5.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.