Hyundai Aura: కేవలం 67 వేల రూపాయలకే, హ్యుందాయ్ ఆరా సెడాన్ కారు కొనుగోలు చేయండిలా..అతి తక్కువ ధరకే లగ్జరీ కారు
కొత్త కారు కొనాలని చూస్తున్నారా, మీ వద్ద డబ్బు తక్కువగా ఉందా, చింతించాల్సిన అవసరం లేదు. అతి తక్కువ డౌన్ పేమెంట్ తో మంచి కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం మీరు ఎంత డౌన్ పేమెంట్ చేయాలో తెలుసుకోండి. అలాగే EMI, వడ్డీ రేట్లు కూడా మీకోసం..
కార్ల రంగంలో తక్కువ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల తర్వాత మిడ్ రేంజ్ సెడాన్ కార్లను కొనేందుకు కస్టమర్లు చాలా ఇష్టపడుతుంటారు. ఈ రోజు మనం హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) గురించి మాట్లాడుకుందాం. ఈ కారు అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ కార్లలో ఒకటి, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత చవకైన సెడాన్ కారు ఇదే అని పేరుంది.
హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) ప్రారంభ ధర రూ. 5,99,900 నుండి రూ. 6,68,696 (ఆన్-రోడ్) వరకు ఉంది. అయితే ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుచేయనవసరం లేని ప్లాన్ గురించి మేము ఇక్కడ చెబుతున్నాము. ఆన్‌లైన్ డౌన్ పేమెంట్, EMI ప్లాన్ ప్రకారం, మీరు హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) బేస్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, కంపెనీ అనుబంధ బ్యాంకు ఈ సెడాన్‌పై రూ. 6,01,696 రుణాన్ని ఇస్తుంది.
ఈ లోన్ తర్వాత, మీరు కనీసం రూ. 67,000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు, ఆ పై ప్రతి నెలా రూ. 12,725 నెలవారీ EMI చెల్లించాల్సి ఉంటుంది. హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)పై పొందిన రుణాన్ని తిరిగి చెల్లించడానికి బ్యాంక్ ఐదేళ్ల కాల వ్యవధిని నిర్ణయించింది. బ్యాంకు ఈ లోన్ మొత్తంపై సంవత్సరానికి 9.8 శాతం వడ్డీని వసూలు చేస్తుంది.
ఈ డౌన్ పేమెంట్ ప్లాన్‌ని తెలుసుకున్న తర్వాత, మీరు ఈ సెడాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఇప్పుడు దాని ఇంజిన్ నుండి ఫీచర్ల వరకు పూర్తి వివరాలను తెలుసుకోండి. హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)) ఇంజిన్, పవర్ గురించి మాట్లాడుతూ, కంపెనీ ఇందులో 1197 సిసి ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజన్ 81.86 bhp శక్తితో పాటు, 113.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.
హ్యుందాయ్ ఆరా మైలేజ్, ఫీచర్లు:
మైలేజీకి సంబంధించి, ఈ సెడాన్ 20.5 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మైలేజీని ARAI ధృవీకరించింది. హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)లో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్-అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రియర్ వ్యూ మిర్రర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ స్టాప్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లను కంపెనీ అందించింది.
ముఖ్య గమనిక:
ఈ హ్యుందాయ్ ఆరాను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న లోన్ మొత్తం, డౌన్ పేమెంట్, వడ్డీ రేటు ప్లాన్ మీ బ్యాంకింగ్ మరియు CIBIL స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మీ బ్యాంకింగ్ లేదా CIBIL స్కోర్‌లో ప్రతికూల నివేదిక వస్తే, బ్యాంకు ఈ మూడింటిలో తదనుగుణంగా మార్పులు చేయవచ్చు.