ఇండియాలోని ఫేమస్ సెలిబ్రిటీల మొదటి కార్లు: సచిన్ టెండూల్కర్ నుండి కత్రినాకైఫ్ వరకు వాడిన కార్లు ఇవే..
First Published Jan 7, 2021, 4:59 PM IST
మనకు నచ్చిన మొదటి సొంత వాహనం జీవితాంతం మన హృదయాల్లో గుర్తుండిపోతుంది. చాలా మంది వారి జీవితకాలంలో ఎన్నో కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారిని మీరు చూస్తూనే ఉంటారు, వారిలో కొంతమంది తమ మొదటి వాహనాన్ని జ్ఞపకార్ధంగా వారితోనే ఉంచుకుంటారు. అయితే దేశంలోని ప్రముఖుల లిస్ట్ లో కొందరి మొదటి వాహనాల జాబితా ఇక్కడ ఉంది. ఇందులో చాలావరకు ప్రముఖులు ఇప్పటికీ వారి మొదటి కార్లను వారి వద్దనే ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్యారేజ్ లో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ అతని మొదటి వాహనం మారుతి సుజుకి 800. భారతదేశంలో మారుతి సుజుకిని ప్రారంభించిన వెంటనే సచిన్ టెండూల్కర్ తన మొదటి కారును 1980 చివరలో కొనుగోలు చేశాడు. అతను తన మొదటి వాహనాన్ని తిరిగి పొందటానికి సహాయం కోరుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేశాడు. కానీ ఇప్పటివరకు తన మొదటి కారు ఆచూకీ తెలియలేదు.

దీపికా పదుకొనే - ఆడి క్యూ 7
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే విలాసవంతమైన కార్లను ఇష్టపడతారు. మెర్సిడెస్-మేబాచ్ కారు కలిగి ఉన్న దేశంలోని కొద్దిమంది ప్రముఖులలో ఆమె ఒకరు. ఆమె భర్త రణవీర్ సింగ్ వద్ద కూడా స్పోర్టి, లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. దీపిక మొట్టమొదటి కారు ఆడి క్యూ 7 కాగా, ఆడి ఎ8ఎల్‌ను కూడా చాలాకాలం పాటు ఉపయోగించారు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?