టేస్లా సిఈఓ ఎలోన్ మస్క్ ఒక్క ట్వీట్ తో ఆ కంపెనీ షేర్లు అమాంతం పెరిగిపోయాయి.. విషయం ఏంటంటే ?
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మరోసారి నేడు వార్తల్లో నిలిచారు. కొద్దిరోజుల క్రితం ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా అవతరించింది మీకు తెలిసే ఉంటుంది. తాజాగా ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ ఒక చిన్న కంపెనీల షేర్లు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ఎలోన్ మస్క్ మంగళవారం రోజున సోషల్ మీడియా ట్విట్టర్ లో 'ఐ కిండా లవ్ ఎట్సీ' అని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఎట్సీ స్టాక్ 9% వరకు పెరిగాయి.
ఎలోన్ మస్క్ వరుసగా ఒకదాని తరువాత మరొక ట్వీట్ చేశాడు. మొదటి ట్వీట్‌లో 'ఐ కిండ లవ్ ఎట్సీ' అంటూ ట్వీట్ చేయగా, మరొక ట్వీట్‌లో ఎట్సీ నుండి తన కుక్క కోసం చేతితో వేసిన మార్విన్ మార్టిన్ హెల్మ్‌ను కొనుగోలు చేశానని ట్వీట్ చేశాడు.
ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ తరువాత ఎట్సీ కి లాటరీ తగిలినటైంది. దీంతో ఎట్సీ షేర్లు మార్కెట్ ప్రారంభమైన వెంటనే 9 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల గత 12 నెలల్లో ఇదే అత్యధికం. ఎట్సీ అనేది ఇ-కామర్స్ వెబ్‌సైట్, దీనిలో చేతితో తయారు చేసిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
ఎలోన్ మస్క్ ఇంతకు ముందు సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ సిగ్నల్ గురించి కూడా ట్వీట్ చేశారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానం గురించి వివాదం ముదురుతున్న సమయంలో ఎలోన్ మస్క్ సిగ్నల్ యాప్ గురించి ట్వీట్ చేశాడు. యూజ్ సిగ్నల్ అని ఎలోన్ మస్క్ ట్వీట్ చేయడంతో సిగ్నల్ అనే ఒక వైద్య సంస్థలో భారీగా పెట్టుబడులు వచ్చి చేరాయి. అయితే అసలు విషయం ఏంటంటే ఎలోన్ మాస్క్ చేసిన్ ట్వీట్ సిగ్నల్ యాప్ గురించి. కాని సిగ్నల్ అనే సంస్థ వాటాలు 116 రెట్లు పెరిగాయి.