Richest Countries: ప్రపంచంలో బాగా డబ్బున్న దేశాలివే. భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా?
Richest Countries: ప్రపంచంలో అత్యధిక తలసరి జీడీపీ కలిగిన టాప్ 10 ధనిక దేశాలు ఏంటో మీకు తెలుసా? వాటికి సంబంధించిన సమాచారంతో పాటు, ఈ లిస్టులో ఇండియా ఏ స్థానంలో ఉందో ఇప్పడు మనం తెలుసుకుందాం.

ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించాలంటే తలసరి జీడీపీ చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయంలో కొన్ని దేశాలు మాత్రమే ఎక్కువ తలసరి జీడీపీతో ఆర్థిక ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఆ దేశాల్లో వ్యాపారాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఐటీ రంగం, సేవలు, ఉత్పాదకత తదితర రంగాల్లో కూడా ఆ దేశాలు త్వరగా పురోగతి సాధిస్తుంటాయి.
ఇలాంటి టాప్ దేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో ఇండియా ఏ స్థానంలో ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
సింగపూర్
తలసరి GDP 141,553 డాలర్లతో సింగపూర్ ధనిక దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఇది వ్యాపారానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంది. అందుకే విదేశాల నుంచి వ్యాపారవేత్తలు ఇక్కడకు వచ్చి వ్యాపారం చేస్తుంటారు. ఈ దేశంలో బిజినెస్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. సింగపూర్ పర్యాటకంగా ఎక్కువ డవలప్ అవుతోంది. అందుకే ఈ దేశం టాప్ లో ఉంది.
ఖతార్
అరబ్ కంట్రీస్ లో ఒకటైన ఖతార్ అధిక ఆదాయం కలిగిన, అభివృద్ధి చెందిన దేశం. ఈ దేశ తలసరి GDP 128,919 డాలర్లు. ఈ దేశం ఎప్పటి నుంచో శిలాజ ఇంధనాలపై ఆధారపడి అభివృద్ధి సాధిస్తోంది. అయితే ప్రస్తుతం ఆయిల్ వర్క్ తగ్గించి మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడేందుకు అవసరమైన ప్రాజెక్టులు చేపడుతోంది. సహజవాయువు, ఆయిల్ నిల్వల్లో ఖతార్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది.
నార్వే
ఐరోపా మొత్తంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో నార్వే ఒకటి. నార్వే డవలప్ మెంట్ అంతా దాని చమురు నిల్వల వల్లనే జరుగుతోంది. ఈ దేశంలో ఆర్థిక శ్రేయస్సు కోసం దేశా నాయకులు అమలు చేసే విధానాలు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇది ఎక్కువ కాలం ఆర్థిక శ్రేయస్సును అందించే స్థిరమైన నిర్వహణ పద్ధతులకు సహాయపడుతుంది.
అమెరికా
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన అమెరికాలో 314 మిలియన్ల ప్రజలు నివసిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం, జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. IT సేవలు, ఆరోగ్య సంరక్షణ పరిశోధన వంటి అనేక రంగాలలో సాంకేతికతను కలిగి ఉంది. అందువల్లనే ధనిక దేశాల్లో టాప్ స్థానంలో కొనసాగుతోంది.
ధనిక దేశాల్లో భారతదేశ స్థానం
మొత్తం మీద ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ భారతదేశం తలసరి GDP 10,166 డాలర్లు మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా 122వ స్థానంలో ఉంది. దీనికి కారణం ఎక్కువ జనాభా. ఇటీవల సంవత్సరాలలో దేశ GDP గణనీయంగా పెరిగింది. కానీ తలసరి సంపద మాత్రం చాలా చిన్న దేశాల కంటే తక్కువ ఉంది.