Bank Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పు ఎవరు బ్యాంకు చెల్లించాలి?
Bank Loan: బ్యాంకులో లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ అప్పును ఎవరు తీరుస్తారో ఎంతో మందికి అవగాహన లేదు. బ్యాంకు ఎవరితో ఆ అప్పును ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తుందో తెలుసుకోండి.

లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే
ప్రజలు బ్యాంక్‌ల ద్వారా లోన్లు తీసుకోవడం అధికంగా ఉంది. వ్యక్తిగత లోను, గృహ లోను, కార్ లోను… ఇలా అనేక రకాలుగా ప్రజలు బ్యాంకులపై ఆధారపడుతున్నారు. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఏమవుతుంది? ఆ బాకీ ఏమవుతుంది? బ్యాంక్ ఎవరితో ఎలా వసూలు చేస్తుంది? అనే ప్రశ్న ఎంతో మంది కుటుంబాలను వేధిస్తుంది. బ్యాంకులు ఎలాంటి వసూలు విధానాలు పాటిస్తాయో తెలుసుకోండి.
కో అప్లికెంట్ ఉన్నప్పుడు
ఒక లోన్‌లో కో అప్లికెంట్ ఉంటే, మరణించిన వ్యక్తి బాధ్యత నేరుగా కో అప్లికెంట్‌పైనే ఉంటుంది. ఇది భార్యాభర్తల పేర్లలో తీసుకునే గృహ లోన్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. కో అప్లికెంట్ EMIలు కొనసాగించాలి. ప్రస్తుత లోన్ ఒప్పందంలో ఎలా నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం వసూలు జరుగుతుంది. ఈ సందర్భంలో బ్యాంక్ లీగల్ హెయిర్‌ల వైపు వెంటనే రావడం లేదు.
గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి లేదా లీగల్ వారసులు
లోన్ తీసుకున్నవారిలో కో అప్లికెంట్ లేకపోతే లేదా చెల్లించలేని స్థితిలో ఉంటే.. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వ్యక్తిని అడుగుతుంది. గ్యారంటీ ఇచ్చిన వ్యక్తి చట్టపరంగా ఆ అప్పుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయన కూడా చెల్లించలేకపోతే, బ్యాంక్ లీగల్ వారసులు చెల్లించాల్సి వస్తుంది. అయితే వారసులకు కూడా బాకీ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. వారు పొందిన వారసత్వ ఆస్తుల పరిమితిలో మాత్రమే బ్యాంక్ వసూలు చేయగలదు. వారసుల వ్యక్తిగత ఆస్తులపై బ్యాంకులకు హక్కు ఉండదు.
బీమా ఉంటే ఫర్వాలేదు
చాలా బ్యాంకులు లోన్ ఇన్సూరెన్స్ లేదా లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ అందిస్తుంటాయి. అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బీమా కంపెనీ లోన్ మొత్తాన్ని బ్యాంక్‌కు చెల్లిస్తుంది. గృహ లోన్లలో హోమ్ లోన్ ఇన్సూరెన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది లేకపోతే కుటుంబానికి లోను భారమైపోతుంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి కూడా మంచిదే. బీమా క్లెయిమ్ వచ్చాక అది బాకీ మొత్తాన్ని కవర్ చేయవచ్చు.
ఆస్తిని స్వాధీనం చేసే హక్కు
ఇంటి లోను, కార్ లోను వంటి సెక్యూర్డ్ లోనులలో బ్యాంక్ దగ్గర ఆస్తి గ్యారెంటీ తీసుకుంటుంది. లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత EMIలు నిలిచిపోతే బ్యాంక్ ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది. తర్వాత ఆస్తిని వేలానికి పెట్టి వచ్చిన మొత్తంతో బాకీ తీర్చుకుంటుంది. వేలం ద్వారా వచ్చిన మొత్తం లోన్ కన్నా ఎక్కువైనా, మిగిలిన మొత్తాన్ని కుటుంబానికి తిరిగి ఇస్తారు.
వ్యక్తిగత లోన్‌లతోనే ఇబ్బంది
పర్సనల్ లోను లాంటి అన్‌సెక్యూర్డ్ లోన్‌లలో బ్యాంకు గ్యారెంటీ కోసం ఎలాంటి ఆస్తులు పూచీకత్తుగా పెట్టుకోవు. ఇలాంటి సందర్భాల్లో బ్యాంక్ వసూలు కోసం మరణించిన వ్యక్తి స్థిరాస్తుల వైపు చూస్తుంది. ఆ ఆస్తులు విలువతో అప్పు తీరకపోతే బ్యాంక్ ఆ లోన్‌ను NPAగా గుర్తించవచ్చు. కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా ఒత్తిడి చేయడం కుదరదు.