Richest Bank: ప్రపంచంలోనే రిచెస్ట్ బ్యాంక్ ఇదే, ఎస్‌బీఐ కంటే ఎంత పెద్దదో తెలుసా?
Richest Bank: ప్రపంచంలోనే అతి ధనిక బ్యాంక్ చైనాలో ఉంది. విపరీతమైన ఆస్తులతో ఇది రిచెస్ట్ బ్యాంక్ గా మారింది. ఇది ఎంత ఆస్తిని కలిగి ఉందో, ఎన్ని ఎస్‌బీఐ బ్యాంకులు కలిపితే ఈ వబ్య

ప్రపంచంలోనే ధనిక బ్యాంక్
ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా అదే ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి రిచెస్ట్ బ్యాంక్ ఒక చైనా బ్యాంక్ నిలిచింది. అది Industrial and Commercial Bank of China (ICBC). ఈ చైనా బ్యాంక్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ గా నిలుస్తోంది. ఆస్తుల పరంగా, శాఖల పరంగా, అంతర్జాతీయ వ్యాపార పరంగా అన్ని అంశాల్లో ICBC వేగంగా ఎదుగుతోంది.
6.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఆస్తులు
తాజా లెక్కల ప్రకారం ICBC వద్ద ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 6.9 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 612 లక్షల కోట్ల రూపాయలకు పైగా అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇంత భారీ ఆస్తులు కలిగిన మరో బ్యాంక్ లేదు. చైనా ప్రభుత్వం నుంచి భారీ మద్దతు రావడం, అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడం వంటివి ICBCను ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లాయి.
SBIతో పోలిస్తే ICBC ఎంత పెద్దది?
మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్. నమ్మకమైన సేవలు, కోట్లాది మంది ఖాతాదారులు వల్ల SBI కూడా ప్రపంచ బ్యాంకుల్లో మంచి గుర్తింపును పొందింది. కానీ ఆస్తుల పరంగా చూస్తే ICBC.. SBI కంటే ఎన్నో రెట్లు పెద్దది. SBI మొత్తం ఆస్తులు ICBCతో పోలిస్తే చాలా తక్కువ. ఆర్థిక పరిమాణంలో ఈ రెండు బ్యాంకుల మధ్య భారీ తేడా కనిపిస్తుంది.
ICBC ఎప్పుడు మొదలైంది?
ICBCని 1984లో జనవరి 1న ప్రారంభించారు. చైనాలో ఆ సమయంలోనే ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. చైనాలో పారిశ్రామిక రంగం, వ్యాపార రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సందర్భంలో పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు ప్రత్యేకంగా రుణాల సేవలు అందించేందుకు ఒక పెద్ద ప్రభుత్వ బ్యాంకును ఏర్పాటు చేయాలని చైనా నిర్ణయం తీసుకుంది. అలా ICBC పుట్టింది.
ఎక్కడెక్కడ శాఖలు ఉన్నాయి?
చైనాలోనే కాదు ఈ బ్యాంకు శాఖలు ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉన్నాయి. ఈ బ్యాంక్ షేర్లు హాంకాంగ్, సింగపూర్ తదితర స్టాక్ మార్కెట్లలో కూడా లిస్టింగ్ అయ్యాయి. అయితే, ఈ బ్యాంకులో ప్రధాన వాటాదారు ఇప్పటికీ చైనా ప్రభుత్వమే. ఈ బ్యాంకుకు కోట్ల సంఖ్యలో వ్యక్తిగత, కార్పొరేట్ ఖాతాదారులు ఉన్నారు. ఈ బ్యాంకు ప్రతి ఏడాది భారీ లాభాలు నమోదు చేస్తోంది.