Budget Cars: మీ జీతానికి తగిన బెస్ట్ కార్లు ఇవిగో.. బడ్జెట్ దాటితే అప్పులు తప్పవు
Budget Cars: మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీ శాలరీ లేదా నెలవారీ ఆదాయానికి తగిన కారునే కొంటున్నారా? ఎంత సంపాదించే వాళ్లు ఎంత రేంజ్ లో కారు కొనాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ రోజుల్లో కారు ఒక స్టేటస్ సింబల్. చాలామంది తమ అవసరానికి తగిన కారు కాకుండా సొసైటీలో స్టేటస్ కోసం ఎక్కువ డబ్బులు పెట్టి కారు కొనుక్కుంటున్నారు. వాళ్లు ఆ కారు కొన్నారు కాబట్టి మనం అంతకన్నా పెద్ద కారు కొనాలని, డబ్బు సరిపోకపోయినా లోన్ పెట్టి మరీ ఖరీదైన కార్లు కొనేస్తున్నారు. మీరు కూడా ఇలా చేస్తే అది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.
కార్ల కంపెనీలు తమ వెహికల్స్ అమ్ముకోవడానికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తాయి. జీరో డౌన్ పేమెంట్ అని, 100 శాతం లోన్ వస్తుందని, ఈఎంఐలు కూడా చాలా తక్కువ ఉంటాయని ఎన్నో ఆఫర్లు ఇస్తారు. ఒకసారి మీరు షోరూమ్ కి వెళితే... ఈ మోడల్ ఫీచర్లు బాగున్నాయని, ఆ కారైతే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుందని మార్కెటింగ్ టీమ్ మిమ్మల్ని ఏదోవిధంగా కన్వెన్స్ చేసి ఎక్కువ ధర ఉన్న కారును మీకు అమ్ముతారు.
ఏదేమైనా ఫైనల్ గా డబ్బు కట్టాల్సింది మీరేనన్న విషయం మీరు ఎప్పుడూ మరిచిపోకూడదు. మీ ఆర్థిక పరిస్థితులను గమనించుకొని, మీ ఆదాయ మార్గాలను కూడా చూసుకొని మీ అవసరాలకు తగిన కారునే మీరు కొనుక్కోవాలి.
మీరు ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఏది చేస్తున్నా మీ ఆదాయానికి ఎంత రేంజ్ లో కారు కొనుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ శాలరీ లేదా మీ నెలవారీ ఆదాయం నెలకు రూ.50 వేల ఉంటే మీరు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు కారు కొనుక్కోవచ్చు. మారుతీ సుజుకి ఆల్టో కె 10, సెలీరియో, ఎస్-ప్రెస్సొ, రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో ఇలాంటి కార్లు ఈ కేటగిరీలోకి వస్తాయి.
ఒకవేళ మీ శాలరీ లేదా ఆదాయం నెలకు రూ. 75 వేల వరకు ఉంటే మీరు రూ.7 లక్షల లోపు కార్లు కొనుక్కోవచ్చు. మారుతీ డిజైర్, బలెనో, టాటా పంచ్, మారుతీ స్విఫ్ట్, హ్యుందయ్ ఎక్స్‌టర్, గ్రాండ్ ఐ10 తదితర కార్లు ఇదే రేంజ్ లో ఉంటాయి.
మీ ఆదాయం నెలకు రూ.1 లక్ష ఉంటే మీరు రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య కారు కొనుక్కోవచ్చు. టాటా నెక్సాన్, కర్వ్, పంచ్ ఈవీ, కియా క్యారెన్స్, సెల్టాస్, మహీంద్రా స్కార్పియో, థార్, బొలెరో, హ్యుందయ్ వెర్నా, క్రెటా ఇలాంటి కార్లు ఇదే ధరలో ఉంటాయి.
ఒకవేళ మీ శాలరీ లేదా ఆదాయం నెలకు రూ.2 లక్షల పైన ఉంటే మీరు రూ.15 లక్షల లోపు కార్లు కొనుక్కోవడం బెటర్. ఈ రేంజ్ లో మహీంద్రా ఎక్స్‌యూవీ 400, 700, స్కార్పియో ఎన్, టాటా హర్రీర్, సఫారీ కార్లు లభిస్తాయి.
మీ ఆదాయం నెలకు రూ.10 లక్షలపైన ఉంటే మెర్సిడిస్, బీఎండబ్లూ కంపెనీల మోడల్స్ కొనుక్కోవచ్చు.
అయితే మీరు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు కొనే కారు ధరలో కనీసం 20 శాతం మీరు డౌన్ పేమెంట్ కట్టాలి. అప్పుడు మాత్రమే మీరు కొన్న కారు మీకు భారంగా అనిపించదు. ఈఎంఐలు కూడా మీరు రిలాక్స్డ్ గా కట్టగలుగుతారు.