WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! ఇకపై కెమెరా ఆన్ చేయకుండానే వీడియో కాల్ మాట్లాడొచ్చు
WhatsApp: వాట్సాప్ లో వీడియో కాల్ వస్తే కాల్ ఎత్తిన తర్వాత కావాలంటే వీడియో ఆపుకోవచ్చు. కాని దీని వల్ల ప్రైవసీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాట్సాప్ యాజమాన్యం కొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది. వీడియో కాల్స్ ఎత్తే ముందే కెమెరాను ఆపేసే ఫీచర్ త్వరలో రానుంది.

వాట్సాప్ వినియోగదారులు త్వరలో వీడియో కాల్స్ ఎత్తే ముందు కెమెరాను ఆపేసే ఫీచర్‌ను పొందనున్నారు. కాల్ మధ్యలో కెమెరాను ఆన్ చేసే ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం. వాట్సాప్‌లో వీడియో కాల్స్ ఎత్తే ముందు కెమెరాను ఆపేసే ఈ ఫీచర్ త్వరలో వస్తుందని సమాచారం.

ఆండ్రాయిడ్ వినియోగదారులు వీడియో కాల్స్ ఎత్తేటప్పుడు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చేలా వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను తయారు చేస్తోంది. వీడియో కాల్ ఎత్తే ముందు డివైజ్ కెమెరాను ఆపేసే ఆప్షన్‌ను ఇచ్చే ఒక కొత్త ఫీచర్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తోందని ఓ నివేదిక ద్వారా తెలిసింది.
ఆండ్రాయిడ్ 2.25.7.3 వాట్సాప్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ కనబడింది. ఈ అప్‌డేషన్‌లో ఒక్క ట్యాప్‌తో కెమెరాను ఆపేయొచ్చు. గూగుల్ మీట్, ఎంఎస్ టీమ్స్ లాంటి వాటిల్లో ఇదివరకే ఈ ఫీచర్ ఉంది.
వాట్సాప్‌లో వీడియో కాల్స్ ఎత్తే ముందు కెమెరాను ఎలా ఆపేయాలి?
ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.7.3 లో ఈ ఫీచర్ కనిపించింది. కాని ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు. కాని యాప్‌ను అప్ డేట్ చేయడం ద్వారా ఈ ఫీచర్ పొందొచ్చు. రిసీవర్ నుంచి వీడియో కాల్ అందుకున్నప్పుడు "టర్న్ ఆఫ్ యువర్ వీడియో" అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఆన్ చేస్తే మీరు జస్ట్ వాయిస్ కాల్ మాట్లాడొచ్చు.
కెమెరా ఇదివరకే ఆపేసి ఉంటే, "వీడియో లేకుండా యాక్సెప్ట్ చెయ్యి" అనే నోటిఫికేషన్‌ను కూడా యాప్ చూపిస్తుంది. వాట్సాప్ వినియోగదారులు కావాలంటే కాల్ మధ్యలో కూడా కెమెరాను ఆన్ చేసే ఆప్షన్ కూడా ఉంది.
ప్రస్తుతం, వాట్సాప్ లో వీడియో కాల్ వస్తే ఆన్ చేసిన తర్వాత మాత్రమే కెమెరా ఆఫ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. దీని వల్ల ప్రైవసీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వాట్సాప్ యాజమాన్యం గుర్తించిందని ఓ నివేదిక ద్వారా తెలిసింది.
వాట్సాప్ మరి కొన్ని ఫీచర్లు
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం చాలా కొత్త ఫీచర్లను వాట్సాప్ తయారు చేస్తోంది. పిన్ ఎంటర్ చేయకుండానే ట్రాన్సాక్షన్లు చేయడానికి పర్మిషన్ ఇవ్వడం ద్వారా పేమెంట్ ప్రాసెస్‌ను ఈజీ చేసే UPI లైట్ ఫంక్షనాలిటీని వాట్సాప్ యాజమాన్యం సిద్ధం చేస్తోంది.
వాట్సాప్ త్వరలో మెటా AI కోసం ఒక కొత్త ఇంటర్‌ఫేస్‌ను రిలీజ్ చేయనుంది. ఇది ఒక ఆటోమేటిక్ వాయిస్ మోడ్. దీని ద్వారా వినియోగదారులకు వాయిస్ ద్వారా సేవలందించాలని వాట్సాప్ యోచిస్తోంది.

