షాకింగ్ న్యూస్: ఈ ఫోన్లలో మరో 5 నెలల్లో WhatsApp పనిచేయదు. మీ ఫోన్ ఆ లిస్టులో ఉందా?
WhatsApp ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మే 5, 2025 నుండి కొన్ని ఫోన్లలో WhatsApp పనిచేయదని తెలిపింది. దీనికి కారణాలు ఇక్కడ తెలుసుకుందాం. వాట్సాప్ చెప్పిన ఆ ఫోన్ల లిస్టులో మీ స్మార్ట్‌ఫోన్ ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి.
WhatsApp ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఫోన్ అన్ లాక్ చేశామంటే ముందుగా ఓపెన్ చేసేది వాట్సాప్ మాత్రమే. ఎవరెవరు మెసేజ్ లు చేశారు? స్టేటస్ లలో ఏం పెట్టారు అని చెక్ చేస్తుంటాం కదా? ఒక రోజు WhatsApp లేకపోయినా రోజు గడవదు. అంత ఇంపార్టెంట్ యాప్ కొన్ని ఫోన్లలో ఇకపై పనిచేయదని ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
WhatsApp ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌గ్రేడ్ ను పొందనుంది. దీని వల్ల కొన్ని ఫోన్లలో WhatsApp పనిచేయదు. అవి కూడా ఐఫోన్లలోనే ఇది పనిచేయదట. అది కూడా కొన్ని మోడల్ ఐఫోన్‌లలో WhatsApp నిలిపివేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. ఏ ఫోన్లలో WhatsApp పనిచేయదో ఇక్కడ తెలుసుకుందాం?
మే 05, 2025 నుండి అంటే ఇంకా 5, 6 నెలల్లో కొన్ని ఐఫోన్‌లలో WhatsApp పనిచేయడం ఆగిపోతుంది. వినియోగదారులకు మెరుగైన భద్రత అందించడానికి WhatsApp ఓ ముఖ్యమైన అప్‌గ్రేడ్ చేయనుంది. అదే సమయంలో కొన్ని ఫోన్‌లకు WhatsApp మద్దతును నిలిపివేయనుంది. ముఖ్యంగా ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లలో వచ్చే ఏడాది మే నెల నుండి WhatsApp నిలిపిపోతుంది. ఇవి పాత ఐఫోన్‌లు కావడం వల్ల వీటిలో WhatsApp అప్‌గ్రేడ్ చేయడానికి సపోర్ట్ సిస్టమ్ లేదు. అందువల్ల ఈ ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.
ఆపిల్ ఐఫోన్ iOS 15.1 కంటే తక్కువ వెర్షన్ ఉన్న ఫోన్లలో WhatsApp పనిచేయదు. ఐఫోన్ 5s, 6, 6 ప్లస్ ఫోన్‌లు iOS 12.5.7 వెర్షన్‌ను మాత్రమే కలిగి ఉన్నాయి. దీని గురించి WAbetainfo సమాచారం అందించింది. WhatsApp వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి WhatsApp కాలానుగుణంగా అప్‌గ్రేడ్ అవుతూ ఉంటుంది. కొత్త ఫీచర్లను అందిస్తుంది. ప్రస్తుతం WhatsApp iOS 12 వెర్షన్‌కు సపోర్ట్ గా పనిచేస్తోంది. కానీ కొత్త అప్‌గ్రేడ్‌తో కనీసం 15.1 వెర్షన్ iOS, ఆధునిక వెర్షన్ iOS లో అప్ గ్రేడ్ కి అవకాశం ఉంటుందని WAbetainfo చెబుతోంది.
వినియోగదారులు వారి WhatsApp వాడకాన్ని కొనసాగించడానికి కంపెనీ 5 నెలల గడువు ఇచ్చింది. 5 నెలల ముందుగానే ప్రకటించడం ద్వారా WhatsApp వినియోగదారులు వారి ఫోన్ పరికరాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి లేదా మార్చడానికి అవకాశం కల్పించింది. హార్డ్‌వేర్ మద్దతు లేకపోతే కొత్త ఫోన్‌కు మారే అవకాశం ఉందని చెప్పింది. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్‌లు విడుదలై 10 సంవత్సరాలు అవుతోంది. ఒకవేళ మీ దగ్గర ఈ పాత ఐఫోన్ ఉంటే ఫోన్‌ను మార్చడం మంచిది.
WhatsApp అప్ గ్రేడ్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మరిన్ని కొత్త ఫీచర్లు కూడా విడుదల అవుతాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందించడానికి WhatsApp ముందుకొచ్చింది. ముఖ్యంగా వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త ఫీచర్లు అమలు చేయనుంది. ఇప్పటికే చాట్ లాక్, వీడియో మెసేజ్ వంటి అనేక ఫీచర్లను WhatsApp వినియోగదారులకు అందించింది.