- Home
- Business
- Washing machine: వాషింగ్ మిషిన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? రూ. 10 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు
Washing machine: వాషింగ్ మిషిన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? రూ. 10 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు
Washing machine: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో వాషింగ్ మిషిన్స్ వినియోగం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో రూ. 10 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ వాషింగ్ మిషిన్స్, వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Realme TechLife 7 kg
ఈ టాప్‌లోడ్ వాషింగ్ మిషిన్ అసలు ధర రూ. 21,990కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం డిస్కౌంట్‌కి లభిస్తోంది. దీంతో దీనిని రూ. 11,290కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే..
* ఫుల్లీ ఆటోమెటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషిన్.
* 7000 ఆర్‌పీఎమ్.
* 5 స్టార్ రేటింగ్
* 7 కేజీ కెపాసిటీ
* డీప్ క్లీనింగ్, మ్యాజిక్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
LG 7 kg 5 Star with Wind Jet Dry
ఎల్జీ కంపెనీకి చెందిన ఈ వాషింగ్ మిషిన్ రూ. 10,490కి లభిస్తోంది. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 16,390 కాగా 35 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అదనంగా పాత వాషింగ్ మిషిన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 4,390 పొందొచ్చు. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
* 7 కేజీ కెపాసిటీ ఈ వాషింగ్‌ను తీసుకొచ్చారు.
* సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్.
* 1350 ఆరీపీఎమ్‌తో డ్రమ్ తిరుగుతుంది.
* 5 స్టార్ రేటింగ్ ఈ వాషింగ్ మిషన్ సొంతం.
MOTOROLA 10 kg
రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ వాషింగ్ మిషిన్స్‌లో మోటోరోలా ఒకటి. 10 కిలోల కెపాసిటీతో కూడిన ఈ వాషింగ్ మిషిన్ అసలు ధర రూ. 20,990గా ఉండగా, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా 51 శాతం డిస్కౌంట్‌కి రూ. 10,190కే లభిస్తోంది. ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
* సెమీ ఆటోమెటిక్ టాప్‌లోడ్.
* 1350 ఆర్పీఎమ్‌తో కూడిన స్పీడ్ మోటర్‌ను ఇచ్చారు.
* 5 స్టార్ రేటింగ్ ఈ వాషింగ్ మిషిన్ సొంతం.
* 10 కేజీ కెపాసిటీతో తీసుకొచ్చారు.
Whirlpool 7 kg 5 Star
వాషింగ్ మిషిన్స్‌కు పెట్టింది పేరైన వార్పూల్ కంపెనీపై మంచి డీల్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రొడక్ట్‌పై 21 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాషింగ్ మిషిన్ అసలు ధర రూ. 12,800 కాగా డిస్కౌంట్ తర్వాత రూ. 9,990కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే..
* సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్.
* 1400 ఆర్పీఎమ్‌తో స్పీన్ వేగం, డ్రైయింగ్ టైమ్ తక్కువగా ఉంటుంది.
* 5 స్టార్ రేటింగ్‌తో ఈ వాషింగ్ మిషిన్‌ను తీసుకొచ్చారు.
* 7 కేజీల కెపాసిటీ ఈ వాషింగ్ మిషిన్ సొంతం.
Thomson 7.5 kg
తక్కువ ధరకు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ వాషింగ్ మిషిన్స్‌లో థామ్సన్ ఒకటి. ఈ వాషింగ్ మిషిన్ అసలు ధర రూ. 11,499 కాగా ఫ్లిప్ కార్ట్‌లో 34 శాతం డిస్కౌంట్‌కి లభిస్తోంది. దీంతో ఈ ప్రొడక్ట్‌ను రూ. 7,490కే పొందొచ్చు. అలాగే మీ పాత వాషింగ్ మిషిన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 4,930 డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
* సెమీ ఆటోమెటిక్ టాప్ లోడ్.
* 1400 ఆర్పీఎమ్
* 5 స్టార్ రేటింగ్
* 7.5 కేజీల కెపాసిటీ.