Car Loan: కారు కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇదిగో
జిఎస్టీ 2.0 వచ్చాక కారు కొనాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. ఎందుకంటే కార్లపై లక్ష రూపాయల వరకు ధరలు తగ్గాయి. ఇక లోన్ (car loan) పెట్టేందుకు ఏ బ్యాంకు ఎంత వడ్డీతో రుణం ఇస్తుందో ఇక్కడ ఇచ్చాము.

కారు కొంటున్నారా?
జిఎస్టి 2.0 అమల్లోకి వచ్చాక కారు కొనే వారి సంఖ్య పెరిగిపోయింది. చాలా తక్కువ డౌన్ పేమెంట్‌తోనే కార్లు అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకుల దగ్గర రుణం తీసుకుంటే నచ్చిన కారును సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కార్లు ఉన్నాయి. అలాగే బ్యాంకులో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కారు రుణాలను ఏ బ్యాంకు ఎంత వడ్డీతో అందిస్తుందో ఇక్కడ ఇచ్చాము తెలుసుకోండి.
క్రెడిట్ స్కోరును బట్టే రుణం
బ్యాంకుకు ఏ రుణం కోసం వెళ్లినా కూడా మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ కోరు ఎక్కువగా ఉండాలని తెలుసుకోండి. 750 కంటే ఎక్కువ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తాయి. ఇక కారు రుణాన్ని తీర్చేందుకు కాలవ్యవధి గరిష్టంగా ఏడేళ్లు ఉంటుంది. కారు ఆన్ రోడ్డు ధరలో 80 శాతం నుంచి 90 శాతం వరకు రుణాన్ని అందించేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. కొన్ని ఫైనాన్సు సంస్థలు అయితే కారు విలువపై 100 శాతం రుణం ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తాయి. ఇక ప్రాసెస్ ఎందుకు ఫీజులు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి.
అతి తక్కువ కారు వడ్డీ ఇచ్చే బ్యాంకు
మీ క్రెడిట్ స్కోరు బట్టి ఒక్కో బ్యాంకు ఒక్కోలా మీకు రుణాన్ని అందజేస్తుంది. అన్నిట్లో కన్నా కారు లోను తక్కువ వడ్డీకి అందిస్తున్న బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది కేవలం 7.70 శాతం వడ్డీతోనే కారు రుణాన్ని అందిస్తోంది. ఇక రెండో స్థానంలో యూనియన్ బ్యాంకు నిలిచింది. ఇది 7.80 శాతంతో కారు రుణాన్ని ఇస్తుంది.
మిగతా బ్యాంకులు ఇలా
ఇక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 7.80 శాతం నుంచి కారు లోను అందించేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత 7.85 శాతం వడ్డీతో పంజాబ్ నేషనల్ బ్యాంకు కారు లోను అందిస్తోంది. అంతే శాతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అందిస్తోంది. ఇక కెనరా బ్యాంక్ 8.05 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 8.15 శాతంతో అందిస్తోంది.
ఎస్‌బీఐ ఎంత ఇస్తోంది?
ఇక గవర్నమెంట్ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోను కనిష్టంగా 8.90 శాతం నుంచి అందిస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు 9.15 శాతం నుంచి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు 9.40 శాతం నుంచి కారు లోను అందిస్తున్నాయి. ఇక బజాజ్ ఫిన్ సర్వ్ వంటి ప్రైవేటు రుణసంస్థలు 14 శాతం వడ్డీని కార్లపై వసూలు చేస్తున్నాయి.